ETV Bharat / bharat

'కార్మికుల కష్టాలు చెప్పుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌లు'

author img

By

Published : Apr 14, 2020, 3:38 PM IST

దేశవ్యాప్తంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో.. వారి సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు 20 కంట్రోల్​ రూంలను ఏర్పాటుచేసి వారి ఉపాధి, వేతన సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపింది.

Govt sets up 20 control rooms to address wage-related issues, migrant workers' plight amid lockdown
కార్మికుల కష్టాలు చెప్పుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌లు

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కరవై, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కార్మికులు. ఓవైపు ఉపాధి లేక, మరోవైపు వేతనాలు రాక తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించే దిశగా 20 కంట్రోల్​ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర కార్మిక శాఖ. వలసకూలీలు కూడా తమ సమస్యలను చెప్పుకునేందుకు ఈ కాల్​సెంటర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

ఇవాళ్టితో లాక్​డౌన్​ ముగిసి.. సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కార్మికులు ఎదురుచూశారు. అయితే.. తాజాగా మే 3 వరకు లాక్​డౌన్​ కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో కార్మికుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ అభిప్రాయపడింది.

సీఎల్‌సీ ఆధ్వర్యంలో రోజూ పర్యవేక్షణ

ఈ కాల్‌ సెంటర్లను ఫోన్‌ నంబర్‌, వాట్సాప్‌, ఈ-మెయిల్స్‌ ద్వారా పొందవచ్చని కార్మిక శాఖ స్పష్టం చేసింది. కంట్రోల్‌ రూమ్‌లను లేబర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, అసిస్టెంట్‌, రీజనల్‌ లేబర్‌ కమిషనర్లతో సహా.. ఆయా ప్రాంతాల డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్లు నిర్వహిస్తారని వివరించింది. మొత్తం 20 కాల్‌ సెంటర్ల పనితీరును రోజూ ప్రధాన కార్యాలయం- చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌(సీఎల్‌సీ) పర్యవేక్షిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది.

ఐఎల్‌ఓ అంచనా..

భారత్‌లో లాక్‌డౌన్‌ కారణంగా.. అసంఘటిత రంగంలో దాదాపు 40 కోట్ల మంది కార్మికులు దారిద్ర్యరేఖ దిగువకు చేరే అవకాశముందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనావేసింది.

ఇదీ చదవండి: 'భయం వద్దు.. దేశంలో సరిపడా నిత్యావసరాలు, ఔషధాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.