ETV Bharat / bharat

మళ్లీ మారనున్న భారత్​ మ్యాప్​- లోక్​సభకు కీలక బిల్లు - పార్లమెంటు తాజా వార్తలు

ఇప్పటివరకూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న దమణ్ ​దీవ్​, దాద్రానగర్‌ హవేలీని విలీనం చేసి ఒకటే యూటీగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన దాద్రానగర్‌ హవేలీ, దమణ్​దీవ్ (కేంద్రపాలిత ప్రాంతాల విలీనం) బిల్లు 2019ని లోక్​సభలో ప్రవేశపెట్టింది.

Govt plans to merge 2 UTs -- Daman and Diu, Dadra and Nagar Haveli; Bill introduced in LS
లోక్​సభలో మరో బిల్లు.. 2 కేంద్రపాలిత ప్రాంతాలు విలీనం
author img

By

Published : Nov 26, 2019, 3:22 PM IST

రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న దమణ్​ దీవ్​, దాద్రానగర్‌ హవేలీని పరిపాలనా సౌలభ్యం తదితర కారణాలతో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. రెండింటిని ఒకటే యూటీగా మార్చే దాద్రానగర్‌ హవేలీ, దమణ్​దీవ్ (కేంద్రపాలిత ప్రాంతాల విలీనం) బిల్లు 2019ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్​ రెడ్డి ఇవాళ లోక్​సభలో ప్రవేశపెట్టారు.

దమణ్​ దీవ్​, దాద్రానగర్‌ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం 35 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ ఇరు ప్రాంతాలకు వేర్వేరు సచివాలయాలు ఉన్నాయి. దాద్రానగర్‌ హవేలీలో ఒక జిల్లా ఉండగా... దమణ్​ దీవ్​లో రెండు జిల్లాలు ఉన్నాయి.

కొత్తగా ఏర్పడే యూటీకి దాద్రా, నగర్‌ హవేలీ, దమణ్​ దీవ్​ అనే పేరు పరిశీలనలో ఉంది. నూతన యూటీ ప్రధాన కేంద్రంగా దమణ్​ దీవ్​ ఉండే అవకాశముంది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసి... రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ కారణంగా దేశంలో ప్రస్తుతం 9 యూటీలు ఉన్నాయి. అయితే దమణ్ ​దీవ్​, దాద్రానగర్‌ హవేలీ విలీనంతో దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదికి తగ్గనుంది.

New Delhi, Nov 26 (ANI): While addressing at the DEFCOM in Delhi on November 26, the Indian Army Chief General Bipin Rawat said, "Technology is fast changing, if we don't improve procurement cycles, we will always be operating with obsolete equipment." "Instead of having procurement procedures in concentric circles, we need to go into cyclical form so that simultaneous procurement processes can happen," Indian Army Chief added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.