ETV Bharat / bharat

'గంగా ప్రక్షాళనకు రూ. 28 వేల కోట్లు మంజూరు' - Govt has sanctioned

గంగానది ప్రక్షాళన నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. గంగా ప్రక్షాళన కోసం 298 ప్రాజెక్టులు, రూ. 28వేల కోట్లు మంజూరు చేసినట్లు రాజ్యసభ వేదికగా ప్రకటించారు.

'గంగా ప్రక్షాళనకు రూ. 28 వేల కోట్లు మంజూరు'
author img

By

Published : Jun 25, 2019, 12:33 AM IST

రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో గంగానది ప్రక్షాళనపై చర్చ జరిగింది. గంగా ప్రక్షాళనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రూ. 28 వేల కోట్లతో 298 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు వివరించారు. ఇందులో 98 ప్రాజెక్టులు కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. మిగతా ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. గంగా ప్రక్షాళనను 100 శాతం కేంద్ర నిధులతో చేపట్టామన్నారు షెకావత్.

150 మురుగునీటి ప్రాజెక్టులను రూ. 23,130 కోట్లతో మంజూరు చేశామన్నారు. దీనివల్ల మురుగునీటిని తరలించేందుకు కృషి చేశామని వెల్లడించారు. శుద్ధీకరణ పనులను 4972.35 కిలోమీటర్ల మేర చేపట్టామని సభకు నివేదించారు.

2019 మే నాటికి 43 మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 2645.6 కిలోమీటర్ల మేర మురుగునీటిని శుద్ధీకరించామని తెలిపారు.

'నమామి గంగే' పథకం, గంగానది ప్రక్షాళన రెండూ ఒకే కోవకు చెందినవని ఉద్ఘాటించారు. 4వేల 465 గంగానది పరివాహక గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మార్చామని ప్రకటించారు.

ఇదీ చూడండి: పెళ్లి కార్డుతో పర్యావరణ పరిరక్షణ సందేశం

Pithoragarh (Uttarakhand), Jun 24 (ANI): Mountaineers went missing 3 weeks ago near Nanda Devi in Uttarakhand's Pithoragarh. Bodies of these mountaineers have been recovered and Dr Vijay Kumar Jogdande, DM of Pithoragarh spoke on the rescue operation. While speaking to ANI, he said, "Bodies are kept at an advanced camp from which they'll be brought to Nanda Devi base camp and then to Pithoragarh. Concerned embassies will be informed after postmortem."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.