ETV Bharat / bharat

'చైనాను వెళ్లగొట్టలేరు కానీ.. కశ్మీర్​ను కొల్లగొడతారా?' - భూచట్టాలపై పీడీపీ ఆందోళన

కార్పొరేట్ల కోసం కశ్మీరీల భూమిని లాక్కోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. భారత భూభాగం నుంచి చైనాను వెనక్కి పంపాలని హితవు పలికారు. కశ్మీర్​ను కొల్లగొట్టాలని చూసే వారి ఆలోచనలు సఫలం కానివ్వబోమన్నారు. కశ్మీర్​లో ఎవరైనా భూములు కొనుగోలు చేసేలా చట్టాల్లో మార్పులు చేసిన క్రమంలో కేంద్రంపై ఆరోపణలు చేశారు ముఫ్తీ.

mehabooba mufti
మెహబూబా ముఫ్తీ
author img

By

Published : Oct 29, 2020, 5:05 PM IST

"భారత భూభాగం నుంచి చైనాను వెళ్లగొట్టలేరు కానీ, కార్పొరేట్ల కోసం కశ్మీరీల భూమిని లాక్కొవాలనుకుంటున్నారు" అని కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ. కశ్మీర్​లో ఎవరైనా భూమి కొనుగోలు చేసేలా చట్టాల్లో మార్పులు చేయటాన్ని తప్పుపట్టారు. కశ్మీర్​ను కొల్లగొట్టాలనేదే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు.

మెహబూబా ముఫ్తీ

" వారు(కేంద్రం) ఇక్కడ మాట్లాడటానికి ఎవరినీ అనుమతించరు. వారి ఉద్దేశాలన్నీ మత తత్వంతో కూడుకున్నవే. పేదలకు కనీసం ఆహారం అందించటంలో భరోసా ఇవ్వలేకపోయారు. వారు ఉద్యోగాలు, ఆహారం గురించి అడిగిన ప్రతిసారి ఆర్టికల్​ 370ని రద్దు చేశాం, జమ్ముకశ్మీర్​లో భూమి కొనుగోలు చేయొచ్చు అని చెబుతున్నారు. జమ్ముకశ్మీర్​ను అతిపెద్ద జైలుగా మార్చారు. మీరు బలవంతులైతే ముందుగా భారత భూభాగం నుంచి చైనాను వెనక్కి పంపండి. కానీ, కనీసం వారు చైనా పేరు కూడా ఎత్తటం లేదు. వారి బలాన్ని కేవలం జమ్ముకశ్మీర్​పై చూపుతున్నారు. "

- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.

భూచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు

జమ్ముకశ్మీర్​లో దేశంలోని ఎవరైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తూ.. భూచట్టాల్లో మార్పులు చేయటంపై గురువారం ఉదయం ఆందోళన చేపట్టింది పీడీపీ. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు కార్యకర్తలు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నాయి. శ్రీనగర్​లోని పీడీపీ కార్యాలయాన్ని మూసివేసి.. పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఇక ఎవరైనా భూములు కొనొచ్చు!

'భూ చట్టాల వల్ల కశ్మీర్​లో నేరాలు పెరుగుతాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.