ETV Bharat / bharat

'తబ్లీగీ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని త్వరగా పట్టుకోండి'

author img

By

Published : Apr 1, 2020, 8:06 PM IST

దేశంలో నిజాముద్దీన్ మర్కజ్ కలకలం నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. తబ్లీగీ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారిని యుద్ధప్రాతిపదికన గుర్తించాలని ఆదేశించింది. వారితో సన్నిహితంగా మెలిగినవారి వివరాలను సేకరించాలని తెలిపింది. విదేశీయులపై వీసా ఉల్లంఘనల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

VIRUS-CENTRE-STATES-JAMAAT
'తబ్లిగీ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని త్వరగా పట్టుకోండి'

దేశంలో నిజాముద్దీన్ మత ప్రార్థనలు రేపిన కలకలంతో కేంద్రం అప్రమత్తమయింది. అందులో పాల్గొన్న వారి వివరాలు యుద్ధప్రాతిపదికన సేకరించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు రాష్ట్రాలు, యూటీల ముఖ్యకార్యదర్శులు, డీజీపీలతో ఇవాళ సమావేశమయ్యారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. ప్రార్థనలకు హాజరైన విదేశీయులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ వీసా కింద వచ్చి.. మత సమావేశాలకు హాజరైన నేరం కింద పరిగణించాలని సూచించారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారు ఎవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారు వంటి వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు.

తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిని గుర్తించటంలో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు కేంద్రానికి రాష్ట్రాలు విన్నవించాయి. కరోనా నివారణకు చేపట్టిన కొన్ని చర్యలకు ఈ వెతుకులాట విఘాతం కలిగిస్తోందని తెలిపాయి. విదేశీయులను మాత్రం ఇప్పటికే గుర్తించినట్లు రాష్ట్రాలు వెల్లడించాయి. వారిపై వీసా ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు గౌబా సూచించారు.

మర్కజ్​లో 2,300 మంది..

నిజాముద్దీన్​లోని మర్కజ్ భవనంలో 2,300 మందికి పైగా తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని మూడు రోజులుగా ఖాళీ చేయిస్తున్నారు. ఇందులో 617 మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

పలు రాష్ట్రాల్లోని తబ్లీగీ శాఖల్లో మార్చి 21 వరకు 824 మంది విదేశీయులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. వీరు కాకుండా 216 మంది నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్నారు. వీరిలో చాలామంది పర్యటక వీసా ద్వారా భారత్​కు వచ్చారు. నిబంధనల ప్రకారం వీరికి మత కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు.

వారి నుంచి ఎంతమందికి..

నిజాముద్దీన్ మర్కజ్​లో తబ్లీగీ కార్యక్రమాలకు హాజరైనవారిలో జమ్ముకశ్మీర్​లో ఒకరు, తెలంగాణలో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఇలా దేశవ్యాప్తంగా అనేక మంది ఇందులో పాల్గొని వారివారి స్వస్థలాకు తిరిగివచ్చారు. వీరి ద్వారా ఎంతమందికి వైరస్ వ్యాపించిందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

రాష్ట్రాల్లో వచ్చే వారంలోపు పీఎం గరీబ్ కల్యాణ్ పథకాన్ని ప్రారంభించాలని సీఎస్​లకు గౌబా సూచించారు. లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అయితే అంతరాష్ట్రీయంగా వస్తుర వాణాకు అనుమతించాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి.

ఇదీ చూడండి: దిల్లీ నిజాముద్దీన్​ మర్కజ్​ వీడియో విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.