ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఏదైనా బాలికల పూజ తర్వాతే..

బాలికల సంరక్షణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమమైనా.. బాలికలను పూజించిన తర్వాతే చేయాలని పేర్కొంది. ఈ మేరకు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివ్​రాజ్​సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.

author img

By

Published : Dec 25, 2020, 8:33 PM IST

Governments events to start with worship of daughters in madhyapradesh
ఆ రాష్ట్రంలో 'బాలికల పూజ' తర్వాతే ఏ కార్యక్రమమైనా...

మధ్యప్రదేశ్​లో ఇకనుంచి ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా మొదట బాలికలను పూజించిన తరువాతే మొదలుకానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే వ్యక్తి తప్పనిసరిగా ముందు 'బాలికల పూజ' చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విధానాన్ని మొదటిసారిగా 'దివాలీ మిలాన్' అనే ప్రభుత్వ కార్యక్రమంలో అనధికారికంగా నిర్వహించారు. తరువాత మధ్యప్రదేశ్​లోని చాలా ప్రాంతాల్లో ఈ విధానాన్ని అనుసరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఇదే విషయాన్ని సెప్టెంబర్​లో ప్రస్తావించారు.

అయితే తాజాగా ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనేక కార్మిక సంఘాలు స్వాగతించాయి.

ఇదీ చదవండి : మధ్యప్రదేశ్​లో గోవుల సంరక్షణకు 'కౌ క్యాబినెట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.