ETV Bharat / bharat

గోవా సీఎం ప్రమోద్​ సావంత్​కు కరోనా పాజిటివ్​ - రాజ్​నాథ్​ సింగ్​ తనయుడు పంకజ్​సింగ్​

దేశంలో కొవిడ్​ అంతకంతకూ వ్యాప్తిస్తోంది. తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​, కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కుమారుడు పంకజ్​ సింగ్​లకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇటీవల తమను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని, తగు జాగ్రత్తలు పాటించాలని ఇరువురూ సూచించారు.

Goa CM Pramod Sawant tests coronavirus positive
గోవా సీఎం ప్రమోద్​ సావంత్​కు కరోనా పాజిటివ్​
author img

By

Published : Sep 2, 2020, 12:49 PM IST

దేశంలో కరోనా బారినపడే మంత్రుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గోవా సీఎం ప్రమోద్​ సావంత్​కు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్​ లక్షణాలు లేనందున స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు సావంత్​.

'నాకు కరోనా సోకినట్లు తేలింది. ఎలాంటి లక్షణాలూ లేకపోవడంవల్ల స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా. ఇంటి నుంచే విధులను నిర్వర్తిస్తాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నా.'

- ప్రమోద్​ సావంత్​, గోవా ముఖ్యమంత్రి

రాజ్​నాథ్​ తనయుడికి కూడా..​

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తనయుడు, గౌతమ్​ బుద్ధానగర్​ ఎమ్మెల్యే పంకజ్​సింగ్​కు కరోనా సోకింది. వ్యాధి లక్షణాలు కనిపించడం వల్ల పంకజ్​కు పరీక్ష చేయగా.. కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరుతున్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు పంకజ్​.

ఇదీ చదవండి: 'చైనా రక్షణమంత్రితో రాజ్​నాథ్​ భేటీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.