ETV Bharat / bharat

'ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ఓటు హక్కు రద్దు' - గిరిరాజ్​ సింగ్

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో జనాభా పెరుగుదల భారీ స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల ఓటు హక్కును తొలగించాలని సూచించారు. 'ప్రపంచ జనాభా దినోత్సవం' సందర్భంగా జనాభా పెరుగుదలపై గ్రాఫిక్​ చిత్రాన్ని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

'ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ఓటు హక్కు రద్దు'
author img

By

Published : Jul 11, 2019, 5:45 PM IST

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దేశంలో జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ జనాభా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. జన సంఖ్యను నియంత్రించేందుకు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఓటు హక్కును తొలగించాలని సూచించారు.

భాజపా బిహార్​ రాష్ట్ర నాయకుడు, కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్​ సింగ్​ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. జనాభా దినోత్సవం సందర్భంగా దేశ జనాభా పెరుగుదలకు సంబంధించిన గ్రాఫిక్​ చిత్రాలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. 1947-2019 మధ్య దేశ జనాభా 366 శాతం పెరిగిందని అందులో పేర్కొన్నారు. అదే సమయంలో జనాభా తక్కువగా ఉన్న అమెరికాలో కేవలం 113 శాతం మాత్రమే జన సంఖ్య పెరిగిందని ఉదహరించారు.

భారత్​లో జనాభా పెరుగుదల పలు సమస్యలకు కారణమవుతోందని ట్విట్టర్​లో రాసుకొచ్చారు సింగ్. భారత ఆర్థిక వ్యవస్థ, సామాజిక సామరస్యత, అవకాశాలను ఇది దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. నియంత్రణలో విఫలమవటానికి మతపరమైన అడ్డంకులు ఒక కారణమని తెలిపారు. రాజకీయ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.

Giriraj Singh
జనాభా పెరుగుదలపై కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​ పోస్ట్​

జనాభా నియంత్రణకు పటిష్ఠ చర్యలు అవసరమని తెలిపారు గిరిరాజ్ సింగ్.

"ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారి ఓటు హక్కును తొలగించాలని గట్టిగా నమ్ముతున్నా. ఈ నియమం దేశంలోని అన్ని మతాల వారికి వర్తింపజేయాలి. ఏ ఒక్క సామాజిక వర్గానికి మినహాయింపు కల్పించకూడదు."

- గిరిరాజ్​ సింగ్​, కేంద్ర మంత్రి

గిరిరాజ్​ వ్యాఖ్యలను బిహార్​ ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నేతలు తప్పుబట్టారు. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.

ఇదీ చూడండి: 'కర్ణాటక,గోవా పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు చేటు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 11 July 2019
1. German Chancellor Angela Merkel welcoming the new Danish Prime Minister Mette Frederiksen to the chancellery
2. Various of Merkel and Frederiksen greeting officials and taking seats
3. Zoom out from Merkel and Frederiksen seated
4. Merkel and Frederiksen getting up and reviewing guard of honour
5. Merkel and Frederiksen walking down red carpet, reviewing guard of honour and walking into building  
STORYLINE:
German Chancellor Angela Merkel and the visiting Danish prime minister stayed seated Thursday while their countries' national anthems were played at a ceremony in Berlin.
Merkel showed no signs of ill health as she sat alongside Denmark's new leader Mette Frederiksen outside the chancellery - an unusual arrangement at a military honours ceremony.
A day earlier, Merkel was visibly shaking as she stood at a similar event - the third such incident in recent weeks, sparking renewed questions over her health.
She later suggested that the psychological impact of the first shaking episode in mid-June was responsible for the subsequent incidents, saying that she "will have to live with it for a while" but insisting there was nothing to worry about.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.