ETV Bharat / bharat

ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశాలుగా గాంధీ సిద్ధాంతాలు

author img

By

Published : Sep 30, 2019, 11:33 PM IST

Updated : Oct 2, 2019, 4:35 PM IST

శాంతి, సత్యం, అహింసలనే ఆయుధాలుగా రవి అస్తమించని సామ్ర్యాజ్యాన్ని పునాదులతో సహా పెకళించారు  పూజ్య బాపూ. బానిససంకెళ్లు తెంచేందుకు కోట్లాదిమందిని ఏక తాటిపై నడిపి.. జాతివివక్షకు వ్యతిరేకంగా నినదించిన ఎన్నో ఉద్యమగళాలకు... స్ఫూర్తిగా నిలిచారు. క్రూరమైన అణచివేతలకు వ్యతిరేకంగా ఆయన నడిపిన సత్యాగ్రహం... అనంతర కాలంలో చెలరేగిన అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు... ఊపిరిలూదింది. మతవిద్వేషాలు, ఉగ్రవాదాలతో సతమవుతూ శాంతి, సామరస్యాన్ని వెతుకుతున్న ప్రస్తుత ప్రపంచానికి... సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది.

ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశాలుగా గాంధీ సిద్ధాంతాలు

ఆయన ఆలోచన.... భావితరాలకు తారకమంత్రం.

ఆయన భావజాలం... ప్రపంచనేతలకు మార్గదర్శకం.

ఆయన నడిచినబాట... జాతివిపక్షపై జరిగిన పోరాటాలకు ఉద్యమపథం.

తన మాటలు,చేతలు ద్వారా కోట్లాదిమంది భారతీయులలో చైతన్యాన్ని రగిలించి, దేశాన్ని స్వతంత్రం వైపు నడిపించారు జాతిపిత మహాత్మాగాంధీ. ఆయన బోధనలు ప్రపంచనేతలకు ప్రేరణగా నిలిచాయి. జాతివివక్షపై నినదించిన గళాలకు స్ఫూర్తిప్రదాతగా మారాయి.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దలైలామా, మండేలా, అడోల్ఫో పెరెజ్ ఎస్‌క్వీవ్‌, ఐన్‌స్టీన్‌, ఆంగ్‌సాన్ సూకీ తదితరులంతా మహాత్ముడి సిద్ధాంతాల నుంచి ప్రేరణ పొందినవారే. రవీంద్రనాథ్‌ఠాగోర్, పెరల్‌ ఎస్‌బక్‌, యుథాంట్‌, విల్‌డ్యురాంట్‌ వంటి అనేకమంది గాంధీ స్ఫూర్తి జ్వాలతో ప్రభావితమైన వారే. జార్జ్‌బెర్నాడ్‌షా, లూయిస్‌ఫిషర్‌, సీజర్‌చావేజ్‌, హో చి మిన్‌ఇలా ఎందరో... మరెందరో ఆ జాబితాలో.

ఎందరికో ప్రేరణగా...

గాంధీజీ భావజాలం, సిద్ధాంతాలు.. ప్రపంచవ్యాప్తంగా జాతివివక్షపై నినదించిన అనేక గళాలకు ప్రేరణగా నిలిచాయి. ఆయన అహింసాయుత విధానం ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చోట్ల జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య పోరాటంలో ప్రధానపాత్ర పోషించిన నెల్సన్ మండేలా, డెస్మండ్ టుటులు.. గాంధీమార్గంలోనే విజయం సాధించారు.

బాపూజీని పవిత్ర యోధుడిగా నీతి, నైతిక విలువలు కలగలిపి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన శక్తిగా పేర్కొన్నారు మండేలా. నల్లజాతీయుల కోసం పోరాడి అమెరికన్ గాంధీగా ప్రసిద్ధి చెందిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అహింసా మార్గంలోనే పయనించారు. నోబెల్‌పురస్కారాన్ని అంగీకరించిన సమయంలో చేసిన ప్రసంగంలోనూ... అణగారిన ప్రజలు సత్యం, ప్రేమను ఆయుధాలుగా మలిచి పోరాడాలన్న గాంధీ ఆలోచనను ప్రశంసించారు.

దలైలామా, సూకీ గాంధీ బాటలోనే...

ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక మార్పులు.. అహింస మార్గం లోనే సాధ్యమని ఉద్ఘాటించారు. మయన్మార్ ఉద్యమకిరణం ఆంగ్‌సాన్ సూకీ గాంధీ విధానాలకు ప్రభావితమైన వ్యక్తే. ఫిలిప్పీన్స్‌లో బెనిగ్నో అక్వినో జూనియర్ నేతృత్వం వహించిన ప్రజాస్వామ్య ఉద్యమానికి, పోలండ్‌లో జరిగిన సామాజిక పోరాటానికి మహాత్ముడి ప్రేరణలే ఆదర్శం.

గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించే... శాంతియుత నిరసనలతో మార్కొస్ పాలనకు అంతం పలికి.. ఫిలిప్పీన్స్ నిజమైన ప్రజాస్వామ్య వాయువులు పీల్చింది. దక్షిణ కొరియాలో నిరంకుశ సైనిక పాలన మహాత్ముడు చెప్పిన శాంతియుత నిరసనలతోనే ముగిసింది. దీనికి కారణమైన కిమ్ యంగ్ సామ్, కిమ్ డే జంగ్.. గాంధీ మార్గానికి ప్రభావితమైన వారే. వియత్నాం విప్లవయోధుడు హో చి మిన్‌ చేసింది సాయుధ పోరాటమైనా... తమపై గాంధీ ప్రభావం సుస్పష్టమని ప్రకటించారు.

అహింసావాదాన్ని పాటించిన ప్రపంచనేతలు...

గాంధీ విధానాల ద్వారా.. తన పోరాట వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు మెక్సికో-అమెరికన్ పౌర హక్కుల ఉద్యమ నేత సీజర్ చావెజ్. గాంధీమార్గంలోనే నడిచిన చావెజ్.. హింసాత్మక దాడులు జరిగినా అహింసావాదానికి కట్టుబడి ఉన్నారు. 1937లో గాంధీజీని కలిసిన క్రైస్తవవాది జోసెఫ్ జీన్ లాంజా డెల్‌వాస్టో బాపూ సిద్ధాంతాలకు ప్రభావితుడై అనేక రచనలు చేశాడు. గాంధీ అనుచరుడిగా మారి శాంతి సేవకుడిగా పిలుపించుకున్నారు. అల్జీరియన్ ప్రజలపై ఫ్రెంచ్ దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఉద్యమించారు.

గాంధీజీ విధానాలను అనుసరించిన పాలస్తీనాకు చెందిన ప్రొఫెసర్ ఎడ్వర్డ్.... గాజాగాంధీగా ఖ్యాతి గడించారు. మహాత్ముడి బోధనలతో ప్రభావితుడై అర్జెంటీనాకు చెందిన ఎస్‌క్వీవెల్‌.... హింసాయుత ఉద్యమాలతో రగిలిన లాటిన్‌అమెరికన్‌దేశాల్లో శాంతి, న్యాయం పునర్‌స్థాపించిన మహోన్నతుడి గా మన్ననలు అందుకున్నారు. 1970ల్లో అక్కడ సాగిన హక్కులఉద్యమాలకు కొత్తదశను చూపిన దార్శనికుడు అయ్యారు.

పేదరికం, సామాజిక వివక్షలపై...

1955-56లో మోంట్‌గొమెరీలో నల్లజాతీయులు ఏడాదిపాటు అహింసాయుతంగానే బస్సులను బహిష్కరించి నిరసనలు తెలిపారు. ఇటలీ సామాజిక వేత్త డానిలోడాల్కీ అహింసామార్గంలోనే పేదరికం, సామాజిక వివక్షలపై పోరాటం చేశారు. సిసిలియన్ల ఆకలిపోరాటాలకు మద్దతుగా ఆయన చేసిన రచనలు, సాగించిన ఆందోళనలు పాలకవ్యవస్థల్లో చురుకుపుట్టించాయి. ప్రతిగా తనను జైలుపాలు చేసినా డాల్కీ లక్ష్యం చేరేవరకు విశ్రమించలేదు.

వేల్స్ జాతీయవాదులూ స్వయం పాలన కోసం అహింసామార్గంలోనే పోరాటం చేశారు. కమాండర్‌సర్ స్టీఫెన్ కింగ్ హాల్ బ్రిటీష్ నేవీ, ఆర్మీ, వైమానికదళాల ఉన్నతాధికారులకు ఇచ్చిన ఉపన్యాసంలో అణ్వాయుధాల కంటే అహింసాయుత ప్రతిఘటనే శక్తిమంతమైనదిగా చెప్పారు. బుడాపెస్డ్ మహిళలు రష్యన్ ట్యాంకులకు ఎదురు నిలిచి వాటిని నిరోధించారు. టాంజానియా నాయకుడు జులియస్ న్యెరే గాంధీ భావజాలం పట్ల ఎంతో ప్రభావితులయ్యారు.

ఒబామా సైతం గాంధీ మార్గాన్నే...

వీరేకాదు.. స్టాన్లీజోన్స్, హెన్రీ రోజర్, డాక్టర్ కోర్మన్, డబ్ల్యుడబ్ల్యు పియర్సన్, సీఎఫ్​ ఆండ్రూస్, నైజీరియాకు చెందిన ముస్లిం రాజకీయ నేత అమీను కానో సహా మరెందరో మహాత్ముడి మార్గంలో నడిచినవారే.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం గాంధీజీ సిద్ధాంతాలే తనకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ప్రపంచానికి శాంతిపాఠాల బోధనలో గాంధీజీ కృషిని గుర్తించి 1930లో ప్రపంచంలోనే శక్తిమంతమైన నేతగా అమెరికా మహాత్ముడిని ద మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: City Football Academy, Manchester, England, UK. 30 September, 2019.
1. 00:00 Manchester City players at training
2. 00:18 Raheem Sterling running
3. 00:28 Sergio Aguero at training
4. 00:40 Pep Guardiola
5. 00:50 Nicolas Otamendi during the session
6. 01:01 Fernandinho running
7. 01:07 Benjamin Mendy
8. 01:15 Rodri at training
9. 01:25 Riyal Mahrez and Gabriel Jesus
10. 01:31 Bernardo Silva at training
11. 01:44 Guardiola looks on
12. 01:53 City players during drill
13. 02:05 Wide of training session
SOURCE: SNTV
DURATION: 02:11
STORYLINE:
Kevin de Bruyne missed Manchester City training on Monday and is a doubt to face Dinamo Zagreb in the Champions League.
The Belgian has played in every one of City's Premier League and Champions League games this season but was substituted off late in the match at Everton on Saturday.
Pep Guardiola also has injury concerns in central defence and is expected to again start Fernandinho at centre-back alongside Nicolas Otamendi against the Croatian champions.
Last Updated : Oct 2, 2019, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.