ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆంగ్ల నిఘంటువులో కొత్తగా 'మోదీ లై' అనే పదం చేరిందని ఎద్దేవా చేశారు. ఈ పదానికి అర్థం తెలుపుతూ ఉండే ఒక ఫొటోను ట్వీట్టర్ ఖాతాలో పంచుకున్నారు రాహుల్. మార్ఫ్ చేసిన ఈ ఫొటోలో మోదీ లైకు 'నిత్యం అబద్ధాలు చెప్పడం' వంటి అర్థాలున్నాయి.
-
There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry :) pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry :) pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry :) pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019
మన్మోహన్ సలహా తీసుకోవాల్సింది..
పంజాబ్‌లోని ఫరిద్కోట్ జిల్లా బర్గారి నగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్... మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ పాలనల మధ్య ఎంతో వ్యత్యాసముందని అభిప్రాయపడ్డారు.
మన్మోహన్ సింగ్ సలహా తీసుకుని ఉంటే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన నోట్ల రద్దు, జీఎస్టీలను మోదీ అమలు చేసేవారుకాదని తెలిపారు.
" భారత ఆర్థిక వ్యవస్థకు నరేంద్ర మోదీ కలింగించిన నష్టాన్ని పూడ్చేందుకు న్యాయ్ పథకాన్ని తీసుకొస్తున్నాం. మీ పంజాబ్‌కు చెందిన మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా నోట్ల రద్దుతో దేశం జీడీపీలో రెండు శాతం నష్టపోతుందని చెప్పారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.
ఇదీ చూడండి: ఒడిశాలో 'ఫొని' నష్టం రూ.12వేల కోట్లు