ETV Bharat / bharat

'అబ్బే... గంభీర్​ అలాంటి వ్యక్తి కాదే...' - లోక్ సభ

తూర్పు దిల్లీ లోక్​సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో దిగిన గౌతమ్ గంభీర్​పై వచ్చిన ఆరోపణలు ఖండించారు పలువురు క్రికెటర్లు. గంభీర్ మహిళలను కించపరిచే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదన్నారు భారత జట్టు మాజీ సభ్యులు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్.

గంభీర్​ అలాంటి వ్యక్తి కాదే..
author img

By

Published : May 10, 2019, 5:24 PM IST

కరపత్రం వివాదంలో గౌతమ్ గంభీర్​కు క్రికెటర్ల మద్దతు లభించింది. ఆమ్​ ఆద్మీ పార్టీ తూర్పు దిల్లీ అభ్యర్థి అతిషిపై అభ్యంతరకర పదజాలంతో కూడిన కరపత్రాలు పంచారన్నది గంభీర్​పై ఆరోపణ. ఇప్పటికే తనకెలాంటి సంబంధం లేదంటూ ఈ విషయాన్ని ఖండించారు గంభీర్.

తాజాగా క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ ఈ అంశంలో గంభీర్​కు అండగా నిలిచారు. ఈ వివాదంపై ఇరువురూ స్పందిస్తూ ట్వీట్లు చేశారు.

"నిన్నటి పరిణామాలతో దిగ్భ్రాంతికి గురయ్యా. గంభీర్​పై ఆరోపణలు బాధించాయి. రెండు దశాబ్దాలుగా తెలిసిన అతని వ్యక్తిత్వం, నిజాయితీ, మహిళల పట్ల అతనికి ఉండే గౌరవం ఏంటో నాకు తెలుసు. అతని గురించి నేను హామీ ఇవ్వగలను."
-వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్

గంభీర్​ అలాంటి వ్యక్తి కాదే...
గంభీర్​ అలాంటి వ్యక్తి కాదే...

లక్ష్మణ్​తోపాటు గంభీర్​కు ప్రముఖ స్పిన్ మాంత్రికుడు హర్భజన్ మద్దతు పలికాడు.

"గంభీర్​ గురించి నిన్న జరిగిందంతా తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. నాకు గంభీర్ బాగా తెలుసు. మహిళల పట్ల అతను ఏనాడూ అలా ప్రవర్తించడు. ఎన్నికల్లో గెలుస్తాడా, ఓడతాడా అనేది తర్వాతి విషయం. గంభీర్ వీటన్నింటికంటే ఎక్కువ."
-హర్భజన్​ సింగ్ ట్వీట్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.