ETV Bharat / bharat

'రోజుకు 60కి.మీ రహదారుల నిర్మాణమే మా లక్ష్యం'

రోజుకు 60కిలో మీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Apr 15, 2020, 6:35 AM IST

Gadkari plans to set 60km/day target for highway construction
'రోజుకు 60కి.మీ రహదారుల నిర్మాణమే మా లక్ష్యం'

దేశంలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోన్న తరుణంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రోజుకు 60 కిలోమీటర్ల వరకు రహదారుల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

డెవలపర్స్ అసోసియేషన్ క్రెడై-ఎంసీహెచ్ఐ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడిన కేంద్ర మంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే మౌలిక వసతుల అభివృద్ధి జరగాలని అన్నారు.

"గతంలో రోజుకు 30కిలో మీటర్ల రహదారులు నిర్మాణం జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ లక్ష్యాన్ని విజయవతంగా చేరుకున్నాము. దీనిని ఇప్పుడు రోజుకు 60 కిలో మీటర్లకు పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం జరుగుతున్న పనుల కంటే, రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనుల 2-3 రెట్లు వేగంగా జరగాలి."

-నితిన్​ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి

2019-20 ఆర్థిక సంవత్సరంలో 3,979 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తి చేసినట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వెల్లడించింది.

65 వేల కిలో మీటర్ల రహదారుల నిర్మాణమే లక్ష్యంగా భారత్​మాల పరియోజన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు గడ్కరీ చెప్పారు. మొదటి దఫాలో 34,800 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.5.35 లక్షల కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.