కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతం ఆలపిస్తుండగా అస్వస్థతకు లోనయ్యారు గడ్కరీ. నిల్చోలేకపోయిన ఆయన వెంటనే కూర్చుండిపోయారు. అనంతరం గడ్కరీని స్థానిక వైద్యులు పరీక్షించారు. బీపీ, రక్తంలో షుగర్ స్థాయిలు సాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపారు. బుధవారం సాయంత్రం గొంతు నొప్పికి తీసుకున్న ఆంటీబయాటిక్స్ కారణంగానే అనారోగ్యానికి లోనైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
బహిరంగ సభల్లో గడ్కరీ అస్వస్థతకు లోనవటం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలా జరిగాయి. గతేడాది డిసెంబర్లో మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లో జరిగిన ర్యాలీలోనూ సొమ్మసిల్లారు.
ఇదీ చూడండి: 'ఉన్నావ్' విచారణకు సుప్రీం 45 రోజుల గడువు