దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొవిడ్ కేసుల్లో రష్యాను దాటి మూడో స్థానంలో భారత్ నిలిచిన నేపథ్యంలో రాహుల్...కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
-
Future HBS case studies on failure:
— Rahul Gandhi (@RahulGandhi) July 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1. Covid19.
2. Demonetisation.
3. GST implementation. pic.twitter.com/fkzJ3BlLH4
">Future HBS case studies on failure:
— Rahul Gandhi (@RahulGandhi) July 6, 2020
1. Covid19.
2. Demonetisation.
3. GST implementation. pic.twitter.com/fkzJ3BlLH4Future HBS case studies on failure:
— Rahul Gandhi (@RahulGandhi) July 6, 2020
1. Covid19.
2. Demonetisation.
3. GST implementation. pic.twitter.com/fkzJ3BlLH4
కరోనా వైరస్, జీఎస్టీ, నోట్ల రద్దు అమలులో ప్రభుత్వ వైఫల్యం భవిష్యత్‌లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలను ఎద్దేవా చేస్తూ ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. ఈ వీడియోలో మహాభారత యుద్ధంలో పాండవులు 18 రోజుల్లో గెలిచారని, కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో దేశం 21 రోజుల్లో విజయం సాధిస్తుందన్న ప్రధాని మాటలను ఆయన పోస్ట్ చేశారు. కరోనావైరస్ కేసుల పెరుగుదలకు సంబంధించిన గ్రాఫ్‌ను వీడియోలో పొందుపరిచారు.
ఇదీ చూడండి: ఒక్కరోజులో 24,248 కేసులు.. మూడో స్థానానికి భారత్