ETV Bharat / bharat

'కార్ల నుంచి బుల్లెట్​ రైళ్లు తయారు చేసే స్థాయికి'

భారత్-జపాన్​ మధ్య ద్వైపాక్షిక  సంబంధాలు మరింత దృఢమైనందుకు సంతోషంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కార్ల తయారీ నుంచి బుల్లెట్​ రైళ్లు రూపొందించే స్థాయికి చేరుకుందన్నారు. జపాన్​ పర్యటనలో భాగంగా కోబేలో ప్రవాస భారతీయులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ.

'కార్ల నుంచి బుల్లెట్​ రైళ్లు తయారు చేసే స్థాయికి'
author img

By

Published : Jun 27, 2019, 6:19 PM IST

Updated : Jun 27, 2019, 7:58 PM IST

జపాన్​లో ప్రవాస భారతీయులతో మోదీ మాటామంతి

జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో ప్రవాస భారతీయులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని నవ భారత్ నిర్మాణంలో భాగస్వాములైనందుకు ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ గల భారత్​లో 61కోట్ల మంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.

కారు నుంచి బుల్లెట్ రైలు వరకు..

భారత్-జపాన్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దృఢమైనందుకు హర్షం వ్యక్తం చేశారు మోదీ. కార్ల తయారీకి పరస్పర సహకారం అందించుకునే స్థాయి నుంచి బుల్లెట్​ రైళ్లు రూపొందించే స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాల్లో జపాన్​ది ప్రత్యేక స్థానమన్నారు మోదీ.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం అప్పటి ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ, అప్పటి జపాన్​ ప్రధాని యోశిరో మోరిలు ఇరుదేశాల మధ్య బంధాన్ని పెంపొందించేందుకు కృషి చేశారన్నారు మోదీ.

ఈసారి భారత్​లో 61కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇది చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభాతో పోలిస్తే అధికమని గుర్తు చేశారు ప్రధాని.

Intro:Body:

o

Conclusion:
Last Updated : Jun 27, 2019, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.