వర్షాలు కురవక దేశమంతా బీళ్లు వారుతోందని శివ శక్తి సేవా మండలం వారు కప్పలకు పెళ్లి చేసి వరుణుడి అనుగ్రహం పొందాలనుకున్నారు. జులై 19న ఓ ఆడ కప్ప, ఓ మగ కప్పకు ఇంద్రపురిలోని పరమ శివుని ఆలయంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కప్పలను దీవించేందుకు వరుణుడు దిగివచ్చాడు. అప్పటి నుంచి ఆపకుండా వర్షాలు కురిపిస్తూనే ఉన్నాడు.
వర్షాలు వరదగా మారి మానవాళికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ పెళ్లి పెద్దలే ఇక కురిసిన వర్షాలు చాలించి వచ్చే ఏడు రమ్మని కోరుతూ... ఆ జంటను విడదీయాలని నిర్ణయించారు.
వివాహం జరిపించిన ఆ గుళ్లోనే ఆ బొమ్మ కప్ప జంట వివాహ బంధాన్ని రద్దు చేశారు. పూర్తి సంప్రదాయబద్ధంగా విడాకులు ఇప్పించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ విడాకుల వీడియోను చూసినవారు వర్షాలు ఆపేందుకు కప్పలకు విడాకులు ఇప్పించడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు.