ETV Bharat / bharat

లోక్​సభకు ముమ్మారు తలాక్ బిల్లు.. విపక్షాల నిరసన - ముమ్మారు

నూతనంగా రూపొందించిన ముమ్మారు తలాక్​ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. ​ పార్లమెంటు సమావేశాల ఐదో రోజున బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్. ముమ్మారు తలాక్ బిల్లును కాంగ్రెస్​, ఎంఐఎం, ఆర్​ఎస్​పీ వ్యతిరేకించాయి.

విపక్షాల నిరసనల మధ్య లోక్​సభలో ముమ్మారు తలాక్ బిల్లు
author img

By

Published : Jun 21, 2019, 5:06 PM IST

ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్రం నూతనంగా రూపొందించిన ముమ్మారు తలాక్​ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక సభ ముందుకు తీసుకువచ్చిన మొదటి బిల్లు ఇది.

ముమ్మారు తలాక్​ బిల్లును ప్రవేశ పెట్టేందుకు 186 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. 74 మంది వ్యతిరేకించారు.

ఇది మతానికి సంబంధించిన విషయం కాదని మహిళల న్యాయం కోసం తీసుకువచ్చిన బిల్లని రవిశంకర్​ ప్రసాద్ చెప్పారు. గతంలో మద్దతిస్తామని తెలిపిన కాంగ్రెస్​ ఇప్పడు వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు.

వ్యతిరేకించిన కాంగ్రెస్​

ముమ్మారు తలక్​ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్​ నేత శశిథరూర్​ వివరణ ఇచ్చారు. కేవలం ఓకే వర్గాన్ని లక్ష్యం చేసుకుని రూపొందిన బిల్లును తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు.

ఇదేం న్యాయం: ఒవైసి

ముమ్మూరు తలాక్ బిల్లు మహిళల రక్షణ కోసం రూపొందించామని చెబుతున్న కేంద్రం... శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించారు ఎంఐఎం నేత అసదుద్దీన్​ ఒవైసి.

ఇతర వర్గాల వారికి ఒకే ఏడాది జైలు శిక్ష ఉండగా... ముస్లింలకు మూడేళ్లపాటు శిక్ష విధించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు ఒవైసి.

ముమ్మారు తలక్​ బిల్లును ఆర్ఎస్​పీ ఎంపీ ఎన్​.కే ప్రేమ చంద్రన్​ వ్యతిరేకించారు.

హోమియోపతి కేంద్ర మండలి బిల్లు...

నేడు లోక్​సభలో హోమియోపతి కేంద్ర మండలి సవరణ బిల్లునూ ప్రవేశపెట్టారు. బోర్డు కాలపరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచడం ఈ బిల్లు లక్ష్యం. ఈ ప్రకారం మండలి సభ్యులు 2019, మే 17 నుంచి మరో ఏడాది పాటు పదవిలో కొనసాగుతారు.

Kaleshwaram (Telangana), June 21 (ANI): Telangana chief minister K Chandrasekhar Rao on Friday inaugurated the Kaleshwaram Lift Irrigation Project (KLIP) which is said to be the world's biggest in terms of capacity. While speaking to ANI, Maharashtra Chief Minister Devendra Fadnavis said, "Kaleshwaram Lift Irrigation Project is a gift from the people of Maharashtra to the people of Telangana. Telangana completed this project at a record speed. This project will change the face of Telangana." Chief Minister of Andhra Pradesh Jagan Mohan Reddy was also present during inaugural function.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.