అసోం, మిజోరం సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మంత్రి సడక్ యోజన కింద నిర్మిస్తున్న రోడ్డు విషయంలో అసోంలోని హైలకండీ జిల్లా కోచుర్తల్ ప్రాంత ప్రజలకు, సరిహద్దు అవతల ఉన్న మిజోరం వాసులకు మధ్య వివాదమే ఇందుకు కారణం.
54 ఇళ్లు దగ్ధం..
మంగళవారం రాత్రి దుండగులు 54 ఇళ్లకు నిప్పంటించారని ఆరోపించిన కొచుర్తల్ వాసులు.. ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందని వాపోయారు. ఇది మిజోరం వాసులు చేసిన పనేనని పేర్కొన్నారు. మిజోరం వాసులు కూడా అసోం ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బైరాబీ పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద గ్రామ మండలి సభ్యుడు సహా ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దుండగలు దాడి చేశారని ఆరోపించారు. అసోంలోని ఘర్మూరా ప్రాంతం నుంచి వచ్చిన వీరు స్థానిక అధ్యాపకుడి కుటుంబంపైన దాడి చేశారన్నారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
గతేడాది కూడా..
ఇరు రాష్ట్రాల మధ్య ఇటువంటి ఉద్రిక్తతలు ఇదివరకు కూడా నెలకొన్నాయి. గతేడాది ఆగస్టులో అసోంలోని లైలాపుర్, మిజోరంలోని వైరాంగ్తే గ్రామస్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన తర్వాత కేంద్రం, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇదీ చదవండి : శబరిమలకు భక్తుల రాకపై కేరళ కీలక నిర్ణయం