ETV Bharat / bharat

రేపు కశ్మీర్ పర్యటన​కు మరో విదేశీ బృందం - abrogation of 370 european union

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ఐరోపా సమాఖ్య, గల్ఫ్ ప్రతినిధులు బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. పౌరసమాజం, భద్రతాసిబ్బంది, రాజకీయ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఓ ఎంపీల బృందం కశ్మీర్​లో పర్యటించింది.

kashmir
రేపు కశ్మీర్ పర్యటన​కు మరో విదేశీ బృందం...
author img

By

Published : Feb 11, 2020, 8:48 AM IST

Updated : Feb 29, 2020, 10:52 PM IST

రేపు కశ్మీర్ పర్యటన​కు మరో విదేశీ బృందం

జమ్ముకశ్మీర్​లో పర్యటించడానికి మరో విదేశీ బృందం సన్నద్ధమవుతోంది. ఐరోపా సమాఖ్య, గల్ఫ్ దేశాలకు చెందిన రాయబారుల బృందం.. బుధవారం నుంచి రెండురోజుల పాటు కశ్మీర్​లో పర్యటించనుంది. ఆర్టికల్​ 370 రద్దు అనంతర పరిస్థితులను సమీక్షించనుంది. పౌరసమాజం, భద్రతా సిబ్బంది, నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలతో బృందంలోని ప్రతినిధులు సమావేశం కానున్నారు. పౌరసత్వ చట్ట సవరణ, కశ్మీర్​ అంశంపై గత నెలలో ఈయూ పార్లమెంట్​లో జరిగిన చర్చపై ఓటింగ్​ నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే కశ్మీర్​లో పర్యటించాలని విదేశీ బృందాన్ని భారత ప్రభుత్వం ముందే కోరింది. కానీ ఈ విషయంపై చర్చించాలంటూ కశ్మీర్​ పర్యటన విజ్ఞప్తిని తిరస్కరించారు రాయబారులు.

ఇప్పటివరకు...

ఇంతకుముందే ఐరోపా సమాఖ్యకు చెందిన 23 మంది ఎంపీలు కశ్మీర్​ను సందర్శించారు. అయితే నాటి పర్యటనపై ఇంటర్నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ నాన్​-అలైన్డ్​ స్టడీస్ విమర్శలు చేసింది. కేవలం ఒక వర్గం వారినే ప్రభుత్వం ఈ పర్యటనకు ఆహ్వానించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతినిధుల పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంది. ఐరోపా సమాఖ్య పార్లమెంట్ సభ్యుల పర్యటన వారి వ్యక్తిగతమైనదని వెల్లడించింది.

ఇదీ చూడండి: ఈ నెల 24న భారత్​కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​

ZCZC
PRI NAT NRG
.JAIPUR NRG19
RJ-SOLDIER-FUNERAL
Mortal remains of Army man consigned to flames in Jaipur
         Jaipur, Feb 10 (PTI) The mortal remains of Naik Rajeev Singh Shekhawat, the Army man who was killed in heavy firing and shelling in Degwar sector of Jammu and Kashmir's Poonch district, were consigned to flames at his ancestral village in Jaipur district.
         The cremation, held with full military and state honour in Luhakana Khurd, was attended by large number of people who paid floral tributes to Shekhawat.
         The 36-year-old soldier is survived by his wife Usha and son Adhiraj.
         Jaipur rural MP Rajyavardhan Singh Rathore, Soldier Welfare Department minister Pratap Singh Khachariyawas, Virat Nagar MLA Indraj Singh Gurjar were also present at the funeral along with district administration officials. PTI AG
AD
02102240
NNNN
Last Updated : Feb 29, 2020, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.