సార్వత్రిక సమరం నాలుగో దశకు చేరుకుంది. 71 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్. వీటితోపాటు జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గంలోని కుల్గాం జిల్లాలో ఓటింగ్ జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా అనంత్‌నాగ్‌కు 3 దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.
4వ దశలో పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి ఈ సాయంత్రంతో గడువు ముగిసింది. 71 స్థానాల్లో 12.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం లక్షా 37 వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఈసీ.
71 నియోజకవర్గాల నుంచి 943 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 98మంది మహిళలు.
కట్టుదిట్టమైన భద్రత
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరిస్తోంది.
బరిలో ముఖ్యులు
నాలుగో దశ పోలింగ్‌లో కొంత మంది ప్రముఖులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
అభ్యర్థి | పార్టీ | నియోజకవర్గం |
కన్నయ్య కుమార్ | సీపీఐ | బెగూసరాయి |
డింపుల్ యాదవ్ | ఎస్పీ | కన్నౌజ్ |
నకుల్ నాథ్ | కాంగ్రెస్ | ఛింద్వాడా |
ఊర్మిలా మాతోంద్కర్ | కాంగ్రెస్ | ఉత్తర ముంబయి |
సంజయ్ నిరుపమ్ | కాంగ్రెస్ | ఆగ్నేయ ముంబయి |
గిరిరాజ్ సింగ్ | భాజపా | బెగూసరాయి |
ఎస్ఎస్. అహ్లువాలియా | భాజపా | వర్ధమాన్-దుర్గాపూర్ |
స్వామి సచ్చిదానంద్ హరి సాక్షి | భాజపా | ఉన్నావ్ |
ఇవీ చూడండి: