దిల్లీలో పౌరచట్ట వ్యతిరేక ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు పోలీస్ కానిస్టేబుల్ సహా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 10మంది పోలీసులకు గాయాలయ్యాయి. నిరసనల సందర్భంగా పోలీసులపైకి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిని షారూఖ్‌గా గుర్తించారు.
గాయపడిన పోలీసులను గురు తేజ్ బహద్దూర్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి. ఈ నేపథ్యంలో అల్లర్లు చెలరేగిన జాఫ్రాబాద్, మౌజ్‌పుర్, బాబర్‌పుర్, ఖజూరీల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదీ చూడండి: జనావాసాల్లో గజరాజు బీభత్సం... నలుగురు మృతి