ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భాగంగా తిహార్ జైలులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరానికి దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో శనివారం వైద్య పరీక్షలు జరిగాయి.
కడుపునొప్పిగా ఉన్నట్లు ఆయన ఫిర్యాదు చేయడం వల్ల శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జైలు సిబ్బంది చిదంబరంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించినట్లు అధికారు తెలిపారు.
ఈనెల 17 వరకు జైలులోనే..
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన చిదంబరం జుడీషియల్ కస్టడీని అక్టోబర్ 17 వరకు పొడగిస్తూ దిల్లీ కోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. కేసు విచారణలో భాగంగా సీబీఐ అభ్యర్థన మేరకు ఈ తీర్పు చెప్పింది.
2004-14 మధ్య చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ.305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందినట్లు ఆరోపణలతో 2017 మే 15న ఆయనపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2019, ఆగస్టు 21న అరెస్ట్ చేసింది.
ఇదీ చూడండి: పారే నీటిలో ఓ డిన్నర్.. కావాలంటే ఛలో బెంగళూర్..!