ETV Bharat / bharat

'ప్రణబ్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు' - telugu news updates

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కీలక పారామితులన్నీ స్థిరంగా ఉన్నాయని చెప్పారు.

former-president-pranab-mukherjee-had-tested-positive-for-covid19-and-undergone-surgery-for-a-brain-clot-at-army-hospital-r-and-r
ప్రణబ్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు!
author img

By

Published : Aug 21, 2020, 12:10 PM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. ఈ మేరకు దిల్లీ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్​పైనే ఉంచి.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రణబ్​ కీలక సూచీలన్నీ బాగున్నాయని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం 10 రోజుల ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్​ నిర్వహించారు. ప్రస్తుతం ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కాస్త మెరుగుపడిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

For All Latest Updates

TAGGED:

...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.