దేశంలోని న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌పై ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు.
న్యాయమూర్తుల ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇటీవలే ఓ వీడియోను విడదల చేశారు జస్టిస్ కర్ణన్. దీనిపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. మహిళలను అగౌరపరిచే విధంగా జస్టిస్ కర్ణన్ ఆరోపణలు చేశారని, ఆయనపై చర్యలు చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు లేఖ రాశారు మద్రాసు హైకోర్టులోని సీనియర్ న్యాయవాదులు.
జస్టిస్ కర్ణన్ గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు. కోర్టు ధిక్కరణ, న్యాయప్రక్రియపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2017లో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు.
ఇదీ చూడండి:- హాథ్రస్ ఘటన సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కీలక తీర్పు