ETV Bharat / bharat

24 గంటల్లో 8 వేల మందికి వైద్య పరీక్షలు

author img

By

Published : Apr 4, 2020, 5:05 AM IST

Updated : Apr 4, 2020, 5:11 AM IST

తబ్లీగీ జమాత్ కారణంగా దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. వైరస్​ హాట్​స్పాట్​లను గుర్తించి... 24 గంటల్లో 8 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది. శుక్రవారం ఒక్కరోజులోనే 478 కొత్త కేసులు నమోదవ్వగా... మొత్తం 62 మంది మరణించారు.

Focus shifts to rapid tests as confirmed cases cross 3,000; Govt says numbers in control sans one 'event'
24 గంటల్లో 8 వేల మందికి వైద్య పరీక్షలు

దిల్లీ నిజాముద్దీన్​ తబ్లీగీ జమాత్​ వ్యవహారంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్​ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, తెలంగాణాలో కరోనా కేసులు ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది కేంద్రం.

వైరస్​ హాట్​స్పాట్​లను గుర్తించి... ఆ ప్రాంతాల్లోని వారికి త్వరితగతిన వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. అదే ప్రాంతాల్లో ఐసోలేషన్​ వార్డులనూ కేటాయించినట్టు ప్రకటించింది. 24 గంటల్లోనే 8 వేల మందికి పరీక్షలు నిర్వహించింది.

ఒక్క రోజులో..

శుక్రవారం సాయంత్రం చేసిన ప్రకటనలో దేశవ్యాప్తంగా 2,547కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో 478 కేసులు ఒక్కరోజులో వెలుగుచుశాయి. దేశంలో మృతుల సంఖ్య 62కు చేరింది.

మహారాష్ట్రపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. శుక్రవారం 67 కొత్త కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 490కు చేరింది. తాజాగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మరణాలు 26కు చేరాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.

దిల్లీ, ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​,హిమాచల్​ ప్రదేశ్​, ఇతర రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగుచూశాయి.

రెండు రోజుల వ్యవధిలో తబ్లీగీ జమాత్​కు​ సంబంధించి దాదాపు 647 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపింది ఆరోగ్యశాఖ.

ఇటలీ నుంచి వచ్చిన వారు...

ఇటలీ నుంచి వచ్చి ఐటీబీపీ క్వారంటైన్​ కేంద్రంలో ఉన్న 217మందికి వైరస్​ నెగెటివ్​గా తేలింది. స్వదేశానికి వచ్చిన 14రోజుల అనంతరం వీరికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : కరోనా పంజా: దేశంలో 24 గంటల్లోనే 478 కొత్త కేసులు

Last Updated : Apr 4, 2020, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.