పాము జాతుల్లో ఎగిరే సర్పాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలా ఎగిరే పాము కర్ణాటక- మైసూర్‌లోని ఓ ఇంట్లో దర్శనమిచ్చింది. దట్టమైన అడవుల్లో చాలా అరుదుగా కనిపించే ఈ పాము.. ఓ వ్యక్తి నివాసంలో ప్రత్యక్షమవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుమారు నాలుగు అడుగుల పొడవున్న ఈ సర్పంపై.. భయం కల్పించే రీతిలో నలుపు, పసుపు రంగు చారలున్నాయి.
తన ఇంట్లో పామును చూసి భయపడిన వెంకటరాము.. తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సర్పాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది దొరకకుండా గాల్లోకి ఎగిరి పారిపోయినట్లు అధికారులు తెలిపారు.
![Flying snake Found in the city of Mysore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-3-flying-snake-news-7208092_06062020134550_0606f_1591431350_371_0606newsroom_1591442901_839.jpg)
![Flying snake Found in the city of Mysore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-3-flying-snake-news-7208092_06062020134550_0606f_1591431350_517_0606newsroom_1591442901_329.jpg)
'భయం అక్కర్లేదు'
అయితే పాము గురించి భయపడాల్సిన పనిలేదని అటవీ శాఖ సిబ్బంది స్పష్టం చేశారు. అది విషరహితపాముగా తెలిపారు. ఇలాంటి సర్పాలు నేలమీద పాకకుండా అడవుల్లో నివసిస్తూ.. ఓ చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు ఎగురుతుంటాయని చెప్పారు.
![Flying snake Found in the city of Mysore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-3-flying-snake-news-7208092_06062020134550_0606f_1591431350_343_0606newsroom_1591442901_549.jpg)
ఇదీ చదవండి: మొన్న ఏనుగు.. నేడు ఆవు.. అసలేమైంది?