ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.. 114కు చేరిన మృతులు - వర్షాలు

దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. వరద కారక ప్రమాదాలతో రెండు రోజుల్లోనే 114 మంది మృతిచెందారు. లక్షలాది మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్డీఆర్​ఎఫ్​, ఇతర సహాయక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.
author img

By

Published : Aug 11, 2019, 5:26 AM IST

కుండపోత వర్షాల ధాటికి పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్​లలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు 114 మంది మరణించారు. వరదల్లో చిక్కుకొని మరికొందరు గల్లంతయ్యారు. పలు జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠస్థాయులకు చేరిన కారణంగా గేట్లు ఎత్తివేస్తున్నారు.

కేరళలో వర్షం జోరు...

కేరళలో వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా రెండు రోజుల్లో ఇక్కడ 57 మంది మృతిచెందారు. లక్షా 65 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్టవ్యాప్తంగా 13 వందల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు ముఖ్యమంత్రి పినరయి విజయన్.

దేశవ్యాప్తంగా వర్షబీభత్సం..

ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరద నీరు అలాగే నిలిచి ఉంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది. కొట్టాయంలో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. కోచి విమానశ్రయంలో శనివారం అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. 23 రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.
వయనాడ్​, కన్నూర్​, కసారగోడ్​లలో ఆదివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదీ చూడండి: జలప్రళయంలో చిక్కుకున్న దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు

వయనాడ్​కు రాహుల్​...

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ నేడు పర్యటించే అవకాశముంది. వయనాడ్​ సహా కోజికోడ్​, మలప్పురంలో ఆయన పర్యటించనున్నట్లు తెలిపాయి కాంగ్రెస్​ పార్టీ వర్గాలు. సహాయక చర్యలకు ఆటంకం కలిగించబోనన్న రాహుల్​.. అక్కడ రెండు రోజులు ఉండనున్నట్లు దిల్లీలో మీడియాతో తెలిపారు. బాధితులకు సహాయార్థం ప్రధాని, కేరళ సీఎం, కాంగ్రెస్​ కార్యకర్తలతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో వరుణుడి ప్రతాపం తగ్గుముఖం పడుతోంది. జలదిగ్బంధమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను సైన్యం, నౌకాదళం సురక్షిత ప్రాంతాలకు చేరుస్తోంది. సంగ్లీలో పడవ మునక ప్రమాదంలో 12 మంది గల్లంతయ్యారు.

ఇదీ చూడండి: మహా వరదలు: జలదిగ్బంధంలోనే సంగ్లీ, కొల్హాపుర్​

వరదల కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 30 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 24 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల సహాయార్థం శిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు 10 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. దీనిని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నట్లు ప్రకటించింది.

కర్ణాటకలో ఉప్పొంగుతున్న నదులు...

కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వరదలు ఉగ్రరూపం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు వర్షాల కారణంగా ఇక్కడ 26 మంది మరణించారు. 45 ఏళ్లలో ఈ ప్రకృతి విపత్తును అతి పెద్దదిగా అభివర్ణించారు ముఖ్యమంత్రి యడియూరప్ప. తుంగభద్ర సహా ఇతర నదులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. కృష్ణమ్మ ఉద్ధృతికి ఓ వంతెన కొట్టుకుపోయింది.

గుజరాత్​లో 19 మంది..

గుజరాత్​లోనూ వర్షాలు కల్లోల పరిస్థితులకు కారణమయ్యాయి. వరద కారక ప్రమాదాలకు గురై రాష్ట్రంలో 19 మంది మృతిచెందారు. నడియాడ్​ ప్రగతినగర్​లో మూడంతస్తుల భవనం కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
ASSOCIATED PRESS
Hong Kong, 10 August 2019
1. Wide of fans waiting at venue
2. Medium of fans at the venue
3. VArious of fans
4 . SOUNDBITE (English) Unknown, Exo fan:
"I've been following them for a while. They are super handsome and the music is excellent."
5 . Pan from a screen to fans waiting
6. Medium of fans waiting for the concert
7. Various of concert
STORYLINE:
EXO WOWS FANS IN HONG KONG
South Korean boyband EXO performed for screaming fans in Hong Kong on Saturday (10 AUGUST 2019).
EXO, one of the most well-known Kpop bands, greeted a hall full of screaming fans at AsiaWorld-Expo, a convention and exhibition center in Hong Kong.
The band are on their fifth tour called "EXO PLANET #5 - EXplOration" which kicked off in Seoul in July.
Six members; Chanyeol, Chen, Suho, Sehun, Baekhyun and Kai performed hits including "Overdose" and "Growl."
Three of the group's members; Xiumin, DO and Lay were absent from the concert due to their mandatory military service and work commitment in China.
EXO will also perform in Hong Kong on Sunday 11 August 2019.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.