ETV Bharat / bharat

80 శాతం నీట మునిగిన కజిరంగా పార్క్ - Kaziranga national park

అసోంలో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. లక్షలాది మంది ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. ఖడ్గమృగాలకు నిలయమైన కజిరంగా జాతీయ పార్కు 80 శాతం మేర వరద నీటిలో మునిగింది. ఖడ్గమృగాలు సహా అనేక వణ్యప్రాణులు వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి.

Flood have affected 80 percent of Kaziranga national park
అసోం: 80 శాతం నీటమునిగిన కజిరంగా పార్క్
author img

By

Published : Jul 16, 2020, 1:10 PM IST

అసోంలో వరదల బీభత్సం కొనసాగుతునే ఉంది. భారీగా కురుస్తున్న వర్షాల ధాటికి నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

అసోం: 80 శాతం నీటమునిగిన కజిరంగా పార్క్

ఇప్పటివరకు 26 జిల్లాలకు చెందిన 36 లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకుని మృతిచెందిన వారి సంఖ్య 92కు పెరిగింది. బుధవారం ఒక్కరోజే ఏడుగురు మృత్యువాతపడ్డారు.

దుబ్రి జిల్లా వరదలకు బాగా దెబ్బతింది. ఐదు లక్షల మందికిపైగా నిర్వాసితులయ్యారు. దుబ్రి, ధెమాజీ, లఖీంపుర్, బిశ్వనాథ్, సోనిత్పూర్, దరాంగ్, గోల్‌పారా, కమ్రప్, గోరిఘాట్ మజులి, శివసాగర్, దిబ్రూఘర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లక్షా 28 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది.

ముమ్మరంగా సహాయక చర్యలు

వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. అసోంవ్యాప్తంగా 223 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు.

నీటమునిగిన కజిరంగా జాతీయ పార్క్

గోలాఘట్‌ సమీపంలోని కజిరంగా జాతీయ పార్కు 80 శాతం నీటిలో మునిగిపోయింది. ఇప్పటివరకు 66 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. సుమారు 170 జంతువులను రక్షించినట్లు కజిరంగ నేషనల్ పార్క్ డైరెక్టర్ శివకుమార్ చెప్పారు. జాతీయ పార్కులో పెద్ద సంఖ్యలో ఉన్న రైనోలు, జింకలు, ఏనుగులు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. అటవీ ప్రాంతంలోని మూగ జీవాలు... ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి జనావాసాలకు వెళ్లే క్రమంలో కొన్ని జంతువులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి.

మూగజీవాల సంరక్షణ

వరదల కారణంగా వన్యప్రాణులను ఎత్తైన ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో ప్రత్యేక గదులను ఏర్పాటుచేసి జంతువులను సంరక్షిస్తున్నారు.

ఇదీ చూడండి: ముంబయిని కుదిపేస్తున్న భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.