పని చేసే చోటే ఐదుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర పుణెలో జరిగింది. ఓ వస్త్ర గోదాములో రాత్రి వరకు పని చేసి అక్కడ నింద్రించటమే కార్మికుల పాలిట శాపంగా మారింది.
పుణె ఉర్లి దేవచ్చి గ్రామంలోని స్థానికంగా ఉండే ఓ బట్టల దుకాణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చుట్టుముట్టడం వల్ల ఊపిరాడక ఐదుగురు కార్మికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.
ఇదీ చూడండి: టికెట్ రద్దు చేసిన రెండేళ్లకు రూ.33 రీఫండ్