ETV Bharat / bharat

భారత్​-పాక్​ సరిహద్దులో ఐదుగురు చొరబాటుదారులు హతం - TERRORISTS

INFILTRATION
ఐదుగురు చొరబాటుదారులు హతం
author img

By

Published : Aug 22, 2020, 11:20 AM IST

Updated : Aug 22, 2020, 12:02 PM IST

11:44 August 22

ఐదుగురు చొరబాటుదారులు హతం

సరిహద్దు వెంబడి చొరబాటు కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. పంజాబ్​​లోని భారత్​-పాక్​ అంతర్జాతీయ సరిహద్దు తారన్​ తరన్​ గుండా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టాయి. శనివారం తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.  

"పంజాబ్​ తారన్​ తరన్​ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా దేశంలోకి చొరబాటుకు యత్నిస్తున్నట్లు 103వ బెటాలియన్​కు చెందిన బలగాలు గుర్తించాయి. వారిని అడ్డుకుని వివరాలు తెలుసుకునే క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు చొరబాటుదారులు. అది ఎన్​కౌంటర్​కు దారితీసింది. బలగాల కాల్పుల్లో ఐదుగురు దుండగులు హతమయ్యారు. "  

        - బీఎస్​ఎఫ్​ అధికారి

ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఒక తుపాకీ, ఆయుధాలతో ఉన్న బ్యాగుతో పాటు.. 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  

చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అధికారులు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.  

11:14 August 22

భారత్​-పాక్​ సరిహద్దులో ఐదుగురు చొరబాటుదారులు హతం

పంజాబ్‌లోని భారత్​-పాక్​ సరిహద్దు వద్ద ఐదుగురు చొరబాటుదారులను బీఎస్​ఎఫ్​ జవాన్లు హతమార్చారు.

Last Updated : Aug 22, 2020, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.