దేశ ప్రజలను ఆరోగ్యం వైపు నడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుబిగించారు. నేడు హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ మైదానంలో 'ఫిట్ ఇండియా' ఉద్యమం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల, క్రీడల మంత్రిత్వ శాఖలు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. ఆరోగ్య చిట్కాలపై కసరత్తు చేపట్టాయి.
కార్యక్రమంలో భాగంగా 'ఫిట్నెస్ లోగో'ను ఆవిష్కరించనున్నారు ప్రధాని. అనంతరం ఫిట్నెస్ ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ ప్రతిన చేయాల్సి ఉంటుంది. రోజువారి జీవనంలో శారీరక శ్రమకు సమయం కేటాయించి చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని పొందాలనేది ఈ ఉద్యమ ఉద్దేశం.
ఈ ఉద్యమంలో భారతీయ శాస్త్రీయ, జానపద నృత్యాలను కూడా ప్రోత్సహించనున్నారు. వీటి ద్వారా దేశ సంస్కృతి వ్యాప్తి చెందటమే కాకుండా శారీరక దృఢత్వం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆచితూచి వేయాలి అడుగు..!