మహాకూటమితో అప్రమత్తంగా ఉండాలని మొదటిసారి ఓటేస్తున్న యువతీయువకులకు సూచించారు ప్రధాని నరేంద్రమోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝార్ఖండ్ కోడరమాలో పర్యటించారు మోదీ. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బలమైన సర్కారు కోసం ఓటు వేయాలని యువతను కోరారు.
"మొదటిసారి ఓటు వేయనున్న యువకులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. 'మిషన్ మహాకుమ్మక్కు' విషయంలో జాగ్రత్తగా ఉండండి. కేంద్రంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దోచుకునేవాలన్నదే వారి లక్ష్యం. వాళ్ల సంబంధీకులకూ దోచిపెట్టేస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండకూడదనేది వాళ్ల ఉద్దేశం. అలాంటి అస్థిరత మనకు వద్దు. మనకు బలమైన ప్రభుత్వం కావాలి. మన భవిష్యత్తుపై వాళ్లకు ఎలాంటి చింత లేదు. వాళ్ల భవిష్యత్తును కాపాడుకోవాలన్నదే వారి ఆశయం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: రఫేల్ కేసు వాయిదాకు కేంద్రం అభ్యర్థన