ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చరిత్రలోనే తొలిసారిగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చింపాజీలను, కోతులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగాల్‌లో వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్న అధికారులు... కేసు విచారణలో భాగంగా మూడు చింపాంజీలను, 4 కోతులను అటాచ్ చేశారు.
అక్రమ రావాణా.. ఫోర్జరీ
వన్యప్రాణులను అక్రమంగా కలిగి ఉన్నాడనే కారణంతో సుప్రదీప్ గూహా అనే స్మగ్లర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణులను అక్రమంగా తరలించే క్రమంలో అటవీశాఖ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశాడని పోలీసులు తెలిపారు.
ఈనేపథ్యంలోనే మనీ లాండరింగ్ అభియోగాలపై దర్వాప్తు చేపట్టింది ఈడీ. అతని వద్దనున్న చింపాజీలను,కోతులను స్వాధీనం చేసుకుంది. ఒక్కో చింపాంజీ విలువ 25 లక్షలు కాగా.. దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల విలువ ఒక్కొక్కటి.. ఒకటిన్నర లక్షల రూపాయల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న వన్యప్రాణులను కోల్‌కతాలోని జంతుప్రదర్శనశాల అధికారులకు అప్పగించారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఎన్డీఏ ముఖ్యనేతల సమావేశం