ETV Bharat / bharat

శ్రీరామ నవమి నాడు అయోధ్య మందిరానికి భూమిపూజ!

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికై ఏర్పాటైన 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్'​ ఈనెల 19న తొలిసారి సమావేశం కానుంది. ట్రస్ట్​ అధ్యక్షుడు పరాశరన్​ నివాసంలో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

First meeting of Ram temple trust on Feb 19
ఈనెల 19న అయోధ్య రామ మందిరం ట్రస్ట్​ తొలి భేటీ
author img

By

Published : Feb 10, 2020, 12:59 PM IST

Updated : Feb 29, 2020, 8:44 PM IST

శ్రీరామ నవమి నాడు అయోధ్య మందిరానికి భూమిపూజ!

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటైన 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్'​ ఈనెల 19న తొలిసారి భేటీ కానుంది. ట్రస్ట్​ అధ్యక్షుడు కె. పరాశరన్ నివాసంలో సమావేశం అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

18నే దిల్లీకి సభ్యులు

ఏప్రిల్​ 1న- శ్రీరామనవమి లేదా ఏప్రిల్​ 26న- అక్షయ తృతీయ రోజున మందిర నిర్మాణ పనులు ప్రారంభించడమే లక్ష్యంగా ఈ భేటీ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశం కోసం ట్రస్ట్​ సభ్యులు ఈనెల 18వ తేదీనే దిల్లీ చేరుకోనున్నారని తెలుస్తోంది. ముఖ్యమైన రోజునే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఇప్పటికే ట్రస్ట్​ సభ్యుడు ఒకరు తెలిపారు.

పార్లమెంట్​లో ప్రకటన..

ఫిబ్రవరి 5న పార్లమెంట్​లో రామ మందిర నిర్మాణ ట్రస్ట్​ ఏర్పాటుపై ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రముఖ న్యాయవాది పరాశరన్​ నేతృత్వంలో 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్'​ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దిల్లీలోని పరాశరన్​ నివాసమే ట్రస్ట్​ కార్యాలయమని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: అయోధ్య రామమందిరానికి 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్​

Last Updated : Feb 29, 2020, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.