దిల్లీ అనాజ్ మండీలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం పెను దుర్ఘటన జరిగి 24 గంటలు మరువకముందే అదే భవనంలో మళ్లీ మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.
ఉదయం 7.50కు మంటలు చెలరేగినట్లు సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రెండు అగ్నిమాపక శకటాల సాయంతో 20 నిమిషాల్లో మంటలు ఆర్పారు.
ఆదివారం ఇదే భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగ్గా... 43మంది మృతిచెందారు. 16మంది గాయపడ్డారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చూడండి : దిల్లీ ప్రమాదంలో 43 మంది మృతి.. భవన యజమాని అరెస్టు