ETV Bharat / bharat

కొవిడ్​ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం - Cuttack breaking news

ఒడిశాలోని కొవిడ్​ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తక్షణమే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Fire Breaks Out In COVID Hospital In Odisha's Cuttack
ఒడిశాలోని కొవిడ్​ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం
author img

By

Published : Sep 21, 2020, 4:37 PM IST

ఒడిశాలోని కటక్​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగత్పుర్​లోని సద్గురు కొవిడ్​ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పి వేశాయి. అయితే.. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

ఆసుపత్రి భవనంలో గల గ్రౌండ్​ ఫ్లోర్​లో పెద్దఎత్తున మంటలు చెలరేగగా.. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో మొత్తం 152 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే.. అదే ఆసుపత్రిలో 127 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న 24 మంది రోగులను వేరొక వైద్యశాలకు తరలించారు.

ఇదీ చదవండి: శిక్షణ విమానం కుప్పకూలి పైలట్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.