తమిళనాడు విరుదునగర్ జిల్లా సిట్టిపారెయ్ వద్ద ఓ బాణాసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా పేలుడు మందు రాపిడితో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
నాలుగు అగ్ని మాపక వాహనాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.