దేశ వ్యాప్తంగా పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పార్టీల నాయకులపై, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ సహా 31 మంది నాయకులు, 150 మంది కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎటువంటి అనుమతి లేకుండా డిసెంబర్ 19న పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఎస్పీ నాయకులు, కార్యకర్తలపై సెక్షన్ 144 కింద కోట్వాలీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ దినేష్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
మహారాష్ట్రలో
సెంట్రల్ మహారాష్ట్రలో పౌరచట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై కేసులు నమోదయ్యాయి. పరభణీ, హింగోలీ, బీడ్ జాల్లాల్లో 12,200 కేసులు నమోదయ్యాయి. 104 మందికి పైగా అరెస్టయ్యారు.
అనుమతి లేకుండా నిరసనలు చేపట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి