ETV Bharat / bharat

ఇక బాదుడే: గీత దాటితే లక్ష వరకు జరిమానా! - ఉల్లంఘన

హెల్మెట్​ లేకుండా బండి నడపడం... దొరికితే రూ.100 ఫైన్​ కట్టడం...! మిగిలిన తప్పులకూ అదే తీరు. మహా అయితే రూ.500-1000 జరిమానాతో సరి. ఇక అలాంటి ఆటలు సాగవు. ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించేవారిపై భారీగా జరిమానా వేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. మోటార్​ వాహనాల చట్టం సవరణకు పూనుకుంది.

ఇక బాదుడే: గీత దాటితే లక్ష వరకు జరిమానా!
author img

By

Published : Jun 25, 2019, 11:42 AM IST

రహదారి ప్రమాదాలను అరికట్టడానికి కేంద్రం సమాయత్తమైంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించేవారిపై భారీ జరిమానాలను విధించేలా మోటార్ వాహనాల బిల్లులో చేసిన సవరణలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియడం వల్ల కాలం చెల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం బిల్లులో సవరణలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

రోడ్డు భద్రత అంశంలో కఠినమైన నిబంధనలను ఈ బిల్లులో ప్రతిపాదించారు.

  1. చిన్నపిల్లలు వాహనాలు నడపడం.
  2. తాగి వాహనాలు నడపడం.
  3. లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం
  4. అతివేగం, మోతాదుకు మించి సరుకుల రవాణా వంటి నేరాలపై కఠిన చర్యలు ఉండనున్నాయి

వీటికి రూ.10,000 జరిమానా..!

అంబులెన్స్ తరహా అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వారిపై రూ.10,000 వరకూ జరిమానా విధించనున్నారు. అనర్హతకు గురైన వ్యక్తులు వాహనాన్ని నడిపితే రూ.10,000 జరిమానా విధించాలని కొత్త బిల్లులో ప్రతిపాదించింది ప్రభుత్వం.

అక్షరాలా రూ.లక్ష జరిమానా..!

లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించేవారికి రూ.లక్ష వరకు జరిమానా విధించాలని బిల్లులో పొందుపరిచారు.

జైలుశిక్ష కూడా...!

⦁ అతివేగం కేసులలో రూ.1,000 నుంచి రూ.2,000 వరకూ జరిమానా.

⦁ బీమా లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2000.

⦁ హెల్మెట్‌ లేకుండా వాహనాన్ని నడిపేవారికి రూ.1,000 సహా 3 నెలల పాటు లైసెన్స్‌ నిలుపుదల.

⦁ చిన్నపిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన ఘటనలో వాహన యజమాని లేదా సంరక్షకుడికి రూ.25 వేల వరకూ జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష సహా వాహన రిజిస్ట్రేషన్ రద్దు.

మందుబాబులకు...

⦁ తాగి వాహనాలు నడిపితే రూ.10,000 జరిమానా.

⦁ ఓవర్‌ లోడ్‌తో వాహనాలను నడిపితే రూ. 20,000 వేల జరిమానా.

AP Video Delivery Log - 0500 GMT News
Tuesday, 25 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0437: Cuba Jewish Cemetery AP Clients Only 4217423
Cuba's first Jewish cemetery rescued from neglect
AP-APTN-0410: Japan Nissan Shareholders AP Clients Only 4217422
Nissan shareholders want clarity on firm's future
AP-APTN-0355: Kazakhstan ISS Return AP Clients Only 4217421
Three ISS crew members return safely to Earth
AP-APTN-0349: UAE Pompeo Depart AP Clients Only 4217420
US Secretary of State Pompeo leaves Abu Dhabi
AP-APTN-0316: US HI Skydiving Crash Latest Must credit KITV; No access Honolulu; No use by US broadcast networks 4217418
NTSB seeks tighter rules in wake of Hawaii crash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.