మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు శివసేనలో చేరతారన్న ఊహాగానాలను తోసిపుచ్చారు సినీ నటి, కాంగ్రెస్ మాజీ నేత ఊర్మిళా మాతోండ్కర్. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక... శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు మిళింద్ నర్వేకర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు స్పందించారు ఊర్మిళ.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ... ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. 6 నెలలకే కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీలోని అంతర్గత రాజకీయాలే ఇందుకు కారణమని చెప్పారు.
మహారాష్ట్ర శాసనసభకు వచ్చే నెల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊర్మిళ రాజకీయ భవిష్యత్ మరోమారు చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి : పటేల్ స్ఫూర్తితోనే కశ్మీర్‌పై నిర్ణయం: మోదీ