ETV Bharat / bharat

సుష్మను కోల్పోవడం తీరని లోటు: సోనియా - గాంధీ

సుష్మాస్వరాజ్ మృతికి సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు లేఖరాశారు యూపీఏ ఛైర్​పర్సన్ సోనియాగాంధీ. సుష్మ మంచి వక్త అని, గొప్ప పార్లమెంటేరియన్ అని ఉద్ఘాటించిన సోనియా సుష్మపై ప్రసంశలు కురిపించారు. సుష్మ రాజకీయ జీవితంలో ఎలా ఉన్నారో... అదే వైఖరి వ్యక్తిగత జీవితంలోనూ కొనసాగించారని తన లేఖలో పేర్కొన్నారు.

సుష్మను కోల్పోవడం తీరని లోటు: సోనియా
author img

By

Published : Aug 7, 2019, 5:57 PM IST

సుష్మను కోల్పోవడం తీరని లోటు: సోనియా

సుష్మాస్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు యూపీఏ ఛైర్​పర్సన్ సోనియాగాంధీ. సుష్మ మంచి వక్తని, గొప్ప పార్లమెంటేరియన్ అని ఉద్ఘాటించారు. సుష్మా స్వరాజ్​ భర్త స్వరాజ్​ కౌశల్​కు సంతాప లేఖ రాశారు సోనియా గాంధీ. దివంగత నాయకురాలితో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలున్నాయని, లోక్​సభలో సభ్యులుగా ఒకేసారి పనిచేశామని తన లేఖలో పేర్కొన్నారు.

"సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. సుష్మ ఎంతో ప్రతిభాశాలి. తన ధైర్యం, సంకల్పం, అంకితభావం, సామర్థ్యంతో చేప్టటిన అన్ని బాధ్యతల్లోనూ రాణించారు. అన్నింటికి మించి ఆమె వ్యక్తిగత లక్షణాలే ఆమెకు ఎనలేని ప్రాధాన్యతను చేకూర్చాయి."

-సుష్మ కుటుంబానికి రాసిన లేఖలో సోనియా గాంధీ

రాజకీయ జీవితంలో ఎలా ఉన్నారో, వ్యక్తిగత జీవితంలోనూ అదే వైఖరి కొనసాగించారని తన లేఖలో సోనియా స్పష్టం చేశారు. సుష్మ లేని లోటు ఆమె భర్త, కుమార్తెకు తీరని లోటన్నారు సోనియా.

నేరుగా తలపడిన నాయకురాళ్లు

సుష్మా స్వరాజ్, సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా తలపడ్డారు. 1999 లోక్​సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి లోక్​సభ స్థానం నుంచి భాజపా తరఫున సుష్మ, కాంగ్రెస్ నుంచి సోనియా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుష్మ ఓడిపోయారు.

ఇదీ చూడండి: మహిళలకు దార్శనికురాలు సుష్మ​: అడ్వాణీ

సుష్మకు యావత్​ భారతం కన్నీటి వీడ్కోలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.