ETV Bharat / bharat

రైతు దీక్ష: నడిరోడ్డే వేదిక.. వెనకడుగే లేదిక - రైతుల ఆందోళనలు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఉపసంహరణే ధ్యేయంగా చెక్కుచెదరని సంకల్పంతో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. కొన్ని నెలలపాటు రోడ్లపైనే బైఠాయించడానికి సిద్ధమై వచ్చిన రైతులు తమ భోజన వసతి వరకు సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. వారు బస చేసినచోట ఉన్న ప్రజలు మానవత్వంతో తమవంతుగా కొన్ని రూపాల్లో సాయం చేస్తున్నారు. స్థానికులకూ ఆత్మీయత పంచుతున్నారు రైతులు. దిల్లీ-టిక్రీ సరిహద్దును చూస్తే అదే ఒక గ్రామమా అన్నట్లు కనిపిస్తోంది.

farmers
రైతుల ఉద్యమం
author img

By

Published : Dec 6, 2020, 6:56 AM IST

ఆరుగాలం శ్రమించి దేశానికి బువ్వపెట్టే రైతన్నలకు ఇప్పుడు నడిరోడ్డే నివాసమయింది. పొలాలను దుక్కిదున్నడానికి ఉపయోగించే ట్రాక్టర్లే వారి తాత్కాలిక ఆవాసాలయ్యాయి. కడుపు మండిన రైతులు కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళన అనేక మందిని కదిలిస్తోంది. కొన్ని నెలలపాటు రోడ్లపైనే బైఠాయించడానికి సిద్ధమై వచ్చిన రైతులు తమ భోజన వసతి వరకు సొంత ఏర్పాట్లు చేసుకున్నా, వారు బస చేసినచోట ఉన్న ప్రజలు మానవత్వంతో తమవంతుగా కొన్ని రూపాల్లో సాయం చేస్తున్నారు. దిల్లీ-టిక్రీ సరిహద్దును చూస్తే అదే ఒక గ్రామమా అన్నట్లు కనిపిస్తోంది. వంటలు చేసుకునేవారు కొందరైతే స్నానపానాదులను పూర్తిచేసుకుంటూ మరికొందరు అక్కడ కనిపిస్తున్నారు.

farmers
ఆందోళనలో పాల్గొన్న రైతుల పిల్లలు

ఆరు నెలలైనా పోరాటానికి సిద్ధమే

అవసరమైతే ఆరు నెలలైనా పోరాడడానికి సిద్ధపడే తామంతా పంజాబ్‌ నుంచి వచ్చామని గురునామ్‌ సింగ్‌ (50) అనే రైతు చెప్పారు. ఉద్యమం మొదలయ్యాక అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా, అక్కడి నుంచి నేరుగా దీక్షా శిబిరానికే వచ్చి ఆయన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. "పంజాబ్‌ నుంచి వచ్చాం. ఎక్కడకు వెళ్లినా అక్కడ ప్రేమను పంచుతుంటాం. కరోనా గానీ, చలిగానీ మమ్మల్ని ఏమాత్రం ఆపలేవు" అని గురునామ్‌ తేల్చిచెప్పారు. తమ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారని మన్సాకు చెందిన రామ్‌సింగ్‌ తెలిపారు. కొంతమంది రైతుల పిల్లలూ టిక్రీ సరిహద్దుకు చేరుకుని, నినాదాలు రాయడం వంటి పనుల ద్వారా సాయపడుతున్నారు.

farmers
ఆన్​లైన్​లో చదువుకుంటున్న విద్యార్థులు

సందర్శకులకూ భోజనం

తొమ్మిది రోజులుగా దిల్లీ ప్రవేశమార్గం వద్ద బైఠాయించిన రైతులు అక్కడి స్థానికులతో పాటు సందర్శకులకూ భోజనం సమకూరుస్తున్నారు. రోజుకు దాదాపు 5000 మందికి సరిపడా వంటల్ని వారు వండుతున్నారు. వణికించే చలి, చాలామంది మాస్కులు ధరించకుండా తిరుగుతుండడం, భౌతిక దూరం పాటించకపోవడంతో అనారోగ్య ముప్పు మాత్రం పొంచి ఉంది. దీంతో స్థానిక వైద్యులు శిబిరాలను ఏర్పాటు చేసి, సేవలు అందిస్తున్నారు. రైతులు మాత్రం ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు తమ ఇళ్ల తలుపులనే కాకుండా హృదయాలనూ తెరిచారని రైతులు కృతజ్ఞత భావంతో చెబుతున్నారు.

అవస్థలున్నా చెక్కుచెదరని సంకల్పం

  • రైతులు తమ ఫోన్లను ఛార్జింగ్‌ చేసుకునేందుకు వీలుగా కొంతమంది అక్కడ సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. మరికొందరు తమ దుకాణాల నుంచి విద్యుత్తును ఇస్తున్నారు.
  • స్నానానికి నీళ్లు-సబ్బులు, తినడానికి ఎండు ఫలాలు ఇవ్వడంతో పాటు, దోమలు కుట్టకుండా ఏర్పాట్లను కొందరు స్థానికులు చేస్తున్నారు.
  • గత కొన్నిరోజులుగా చేస్తున్న ఉద్యమంతో స్థానికులతో పరిచయాలు పెరిగి వారినీ తమతో పాటు అల్పాహారానికి, భోజనానికి రావాలని రైతులు ఆహ్వానిస్తున్నారు.
  • దీక్షాస్థలి వద్ద ప్రభుత్వం కొన్ని సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేసినా అవి శుభ్రంగా లేకపోవడంతో మహిళా రైతులు అవస్థలు పడుతున్నారు. ఇబ్బందిని అధిగమించడానికి చీకట్లోనే రెండు కిలోమీటర్ల దూరం వెళ్తున్నారే గానీ తమ సంకల్పాన్ని మాత్రం సడలించుకోవడం లేదు.
  • ఫ్లైఓవర్‌ వంతెనల కింద రాత్రిపూట నిద్రించాల్సి వస్తున్నా వంతుల వారీగా తమకు తామే కాపలా ఉంటున్నామని కొందరు మహిళా రైతులు చెప్పారు.

బండలను పిండి చేసి..

టిక్రీ సరిహద్దుకు మరింతమంది రైతులు చేరుకోకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం పలుచోట్ల పెద్దపెద్ద బండరాళ్లను అడ్డం పెట్టించింది. కొన్నిచోట్ల ఎలాంటి వాహనాలు రాకుండా భారీ కందకాల వంటివి తవ్వించింది. అయినా కవల్జీత్‌ సింగ్‌, దల్బీర్‌ సింగ్‌ వంటి యువరైతులు వాటిని ఛేదించుకుని దీక్షాస్థలికి చేరుకోగలిగారు.

ఇదీ చూడండి: పట్టు వీడని రైతన్న- 11వ రోజుకు చేరిన ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.