ETV Bharat / bharat

రైతులకు మద్దతుగా మహారాష్ట్రలో కిసాన్​ మార్చ్​ - దిల్లీ రైతులకు మద్ధతుగా రైతుల ర్యాలీ

దేశ రాజధాని దిల్లో ఆందోళనలు చేస్తోన్న రైతులకు మద్దతుగా.. మహారాష్ట్రలోని నాసిక్​లో కిసాన్​ మార్చ్​ చేపట్టారు అక్కడి రైతులు. సుమారు 15000 మంది ర్యాలీలో పాల్గొన్నారు. అటు పంజాబ్​లోని లుథియానాలో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం నాటికి దిల్లీ చేరనున్నట్లు వెల్లడించారు.

farmers march in different places in the country to take part in kisan gantantra parade
కిసాన్​ పరేడ్​కు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు
author img

By

Published : Jan 24, 2021, 2:56 PM IST

Updated : Jan 24, 2021, 5:25 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల చేపట్టిన నిరసనలకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఆల్​ ఇండియా కిసాన్​ సభ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. నాసిక్​ నుంచి ముంబయి వైపు నిర్వహించిన ర్యాలీలో 15వేల మంది ప్రజలు పాల్గొన్నారు. అటు పంజాబ్​లోని లుథియానాలోనూ ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

రైతులకు మద్దతుగా మహారాష్ట్రలో కిసాన్​ మార్చ్​

జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహించనున్న కిసాన్​ పరేడ్​లో ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్​ నుంచి దాదాపు 25000 ట్రాక్టర్లు పాల్గొననున్నాయని భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేష్​ టికాయత్​ శనివారం తెలిపారు. దేశ రాజధానిలో ట్రాక్టర్​ ర్యాలీకి దిల్లీ పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ర్యాలీ నిర్వహించే మార్గాలను త్వరలో సంయుక్త్​ కిసాన్​ మోర్చా నిర్ణయిస్తుందని తికాయత్​ అన్నారు.

ఇదీ చదవండి:'ట్రాక్టర్ ర్యాలీ తర్వాతే తదుపరి కార్యాచరణ'

Last Updated : Jan 24, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.