రైతు నాయకులు, కేంద్రానికి మధ్య దిల్లీలో చర్చలు కొనసాగుతున్నాయి. కాగా విరామ సమయంలో స్వయంగా తెచ్చుకున్న ఆహారాన్నే తీసుకున్నారు రైతులు. కర్ సేవ వాహనంలో ఆహార పదార్థాలను తెచ్చుకున్నారు.
![farmer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9775017_eod65g_vqaiirsu-1.jpg)
![farmer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9775017_eod65g_vqaiirsu-2.jpg)
డిసెంబర్ 3న జరిగిన చర్చల్లో భోజనానికి మంత్రులు ఆహ్వానించగా.. రైతు నాయకులు సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు సింఘు సరిహద్దు నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని స్వీకరించారు.
మరోవైపు, కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు కొనసాగుతున్నాయి. తమకు పరిష్కారం కావాలని రైతులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా చర్చలు జరపాల్సింది ఏం లేదని, గత భేటీలో ప్రతిపాదించిన విషయాల్లో వేటిని కేంద్రం అంగీకరిస్తుందో లిఖితపూర్వకంగా చెప్పాలని రైతులు కోరారు.