ETV Bharat / bharat

ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్ - సాగు చట్టాలు

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం కొంతకాలంగా శాంతియుతంగా జరుగుతున్న అన్నదాతల ఆందోళనలు ఇవాళ ఉద్రిక్తతలకు దారితీశాయి. ట్రాక్టర్​ ర్యాలీ కోసం.. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని దిల్లీలోకి ప్రవేశించగా పలు చోట్ల ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.

farmer attack on police with sowrd
పరేడ్​లో ఉద్రిక్తత
author img

By

Published : Jan 26, 2021, 12:20 PM IST

గణతంత్ర దినోత్సవం వేళ రైతుల ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సింఘూ, టిక్రీ, ఘాజీపుర్​ సరిహద్దుల నుంచి బయల్దేరిన కాసేపటికి పలు చోట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నిషిద్ధ ప్రాంతాల నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

సిక్రీ సరిహద్దు వద్ద ట్రాక్టర్లతో వచ్చిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.

సిక్రీ సరిహద్దు వద్ద లాఠీఛార్జి

ఇదే క్రమంలో పోలీసులపైకి ఓ వృద్ధ రైతు కత్తితో దూసుకెళ్లాడు.

కత్తులతో పోలీసులపైకి దూసుకెళ్లిన రైతులు

దిల్లీలోని సంజయ్​ గాంధీ ట్రాన్స్​పోర్ట్​ నగర్​ వద్ద కూడా ఉద్రిక్తతలు తలెత్తాయి. సింఘూ సరిహద్దు నుంచి ఇక్కడికి వచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

సంజయ్​ గాంధీ నగర్​ వద్ద టియర్​ గ్యాస్​ ప్రయోగం

వాహనంపైకి ఎక్కి..

ఇదే ప్రాంతంలో పోలీసుల టియర్​ గ్యాస్​ వెహికిల్​పైకి ఎక్కి నిరసనలు వ్యక్తం చేశారు రైతులు. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు పోలీసులు.

వాటర్​ ట్యాంకర్​ ఎక్కి నిరసన

సంజయ్​ నగర్​ వద్ద బారికేడ్లను దాటి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు రైతులు.

ఘాజిపుర్​ నుంచి బయలుదేరిన రైతుల ర్యాలీని అక్షరధామ్​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు.

దిల్లీ ముకర్బా చౌక్​ వద్ద ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.