ETV Bharat / bharat

400 కి.మీ నడిచి 'నర్మద'కు ప్రత్యేక పూజలు

గుజారాత్​లోని ఓ కుటుంబం.. వడోదర నుంచి మండ్లేశ్వర్​కు 400 కిలోమీటర్లు నడిచి నర్మదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. కుటుంబంలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా సంక్షోభం నుంచి మానవాళిని రక్షించేది నర్మద తల్లేనని తాము విశ్వసిస్తున్నట్టు కుటుంబ పెద్ద అవ్నీశ్​ వెల్లడించారు.

Family walks 400 km on foot to perform rituals
ఇద్దరు చిన్నారులతో 400 కి.మీ యాత్ర
author img

By

Published : Nov 30, 2020, 5:44 PM IST

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ కుటుంబం.. గుజరాత్​ వడోదర నుంచి మండ్లేశ్వర్​కు వెళ్లి పవిత్ర నర్మదా నదిలో పూజలు నిర్వహించింది. ఇందుకోసం వారు 400 కిలోమీటర్లు కాలినడక సాగించడం విశేషం. కరోనా సంక్షోభం నుంచి నర్మదా నదే ప్రజలను కాపాడుతుందని వారు విశ్వసిస్తున్నారు.

'నర్మద తల్లి రక్షిస్తుంది..'

మధ్యప్రదేశ్​ రేవాకు చెందిన అవ్నీశ్​ ఓ జ్యోతిషుడు. 13ఏళ్ల వయస్సులోనే రేవాను విడిచి వడోదర చేరుకున్నారు. అక్కడే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇటీవలే అవ్నీశ్​.. తన భార్య, ఐదేళ్ల బాలిక, రెండున్నరేళ్ల బాలుడితో కలిసి వడోదర నుంచి మండ్లేశ్వర్​కు 400 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేశారు. నర్మదా నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచారించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రపంచాన్ని మింగేస్తున్న కరోనా సంక్షోభం నుంచి మానవాళిని బయటపడేసేది నర్మద తల్లేనని తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు అవ్నీశ్​. ఈ సందర్భంగా తమకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.

"శ్లోక్(కొడుకు)​ పుట్టబోయే సందర్భంగా.. రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​కు వెళ్లాము. 40రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించాము. తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత నా భార్యకు విపరీతమైన నొప్పులు మొదలయ్యాయి. వైద్యులను సంప్రదించిన తర్వాత.. నా భార్య కడుపులో కవలలు ఉన్నారని తేలింది. కానీ అందులో ఒకరు మరణించారని వైద్యులు తెలిపారు. తల్లీ-బిడ్డను రక్షించడం తమ వల్ల కాదని వైద్యులు చేతులెత్తేశారు. కానీ ఆ నర్మద తల్లే నా భర్యను, బిడ్డను కాపాడింది."

-- అవ్నీస్​, జ్యోతిషుడు.

నర్మదకు పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి వేరే ప్రాంతానికి బయలుదేరింది అవ్నీశ్​ కుటుంబం.

ఇదీ చూడండి:ట్రాఫిక్​ కానిస్టేబుల్​ను ఈడ్చుకువెళ్లిన కారు-వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.