మహారాష్ట్రలో అత్యంత తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ చరిత్రకెక్కారు.
59 ఏళ్ల మహారాష్ట్ర రాజకీయాల్లో కేవలం 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఫడణవీస్. పూర్తి మెజారిటీ లేకున్నా ఎన్సీపీ నేత అజిత్ పవార్ సహకారంతో అనూహ్య రీతిలో నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుస పరిణామాల నేపథ్యంలో అజిత్ పవార్ వెనకడుగు వేయటం వల్ల నాలుగో రోజే ఫడణవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
చెరిగిన పీకే సావంత్ రికార్డు
ఫడణవీస్ కన్నా ముందు ఈ రికార్డు మాజీ సీఎం పీకే సావంత్ పేరిట ఉంది. 1963లో అప్పటి ముఖ్యమంత్రి మరాఠ్రావ్ కన్నమ్వార్ మృతి కారణంగా సావంత్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఇదీ చూడండి: 'మహా' పరీక్షకు ముందే ఫడణవీస్ 'మిడిల్ డ్రాప్'