ETV Bharat / bharat

ముగిసిన భారత్​-చైనా విదేశాంగ మంత్రుల భేటీ - సరిహద్దు వివాదం

External Affairs minister Jaisankar meets his Chinese counterpart in Mascow
మాస్కోలో భారత్​-చైనా విదేశాంగ మంత్రుల భేటీ
author img

By

Published : Sep 10, 2020, 8:39 PM IST

Updated : Sep 10, 2020, 11:30 PM IST

23:01 September 10

కీలక అంశాలపై చర్చ..

భారత్​-చైనా విదేశాంగ మంత్రుల భేటీ ముగిసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ జైశంకర్​-వాంగ్​ యీలు కీలక అంశాలను చర్చించారు. రష్యాలోని మాస్కోలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్ (ఎస్​సీఓ) సదస్సు విరామంలో వీరు భేటీ అయ్యారు.

21:54 September 10

వాంగ్​ యీతో జైశంకర్​ చర్చలు

రష్యా రాజధాని మాస్కో వేదికగా భారత్​-చైనా విదేశాంగమంత్రులు సమావేశమయ్యారు. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో జైశంకర్​- వాంగ్​ యీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.  

వాస్తవాధీన రేఖ వెంబడి అలజడులను తగ్గించేందుకు వీరి మధ్య జరిగిన చర్చలు దోహదపడతాయని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి.  

చైనా వైఖరితో..

మే నెల నుంచి భారత్​పై కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. జూన్​ 15న గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటనతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అనంతరం జరిగిన చర్చల వల్ల పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి.

ఈ నేపథ్యంలో గత నెల 29 అర్ధరాత్రి.. మరోమారు చైనా దూకుడు ప్రదర్శించింది. దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పాంగాంగ్​ సరస్సు దక్షిణ భాగంలోనూ అలజడులు మొదలయ్యాయి. ఈ నేపథయంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు.

20:30 September 10

ఉద్రిక్తతల వేళ భారత్​-చైనా విదేశాంగ మంత్రుల భేటీ

భారత్​, చైనా విదేశాంగ మంత్రులు రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. జైశంకర్​-వాంగ్​ యీ మధ్య చర్చలు జరిగాయి. భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినవేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

Last Updated : Sep 10, 2020, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.