ETV Bharat / bharat

కరోనా టీకా సరఫరా వ్యూహంపై నిపుణుల బృందం చర్చ - COVID vaccine latest update

కరోనా మహమ్మారి టీకా లభ్యత, సరఫరాపై జాతీయ నిపుణుల కమిటీ సభ్యులు తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్​ తయారీ, దేశంలో ప్రతి ఒక్కరికి చేరేందుకు తీసుకోవాల్సిన విధివిధానాలు, మౌలిక సదుపాయాలపై చర్చించారు.

Expert group deliberates on strategy to ensure COVID vaccine availability,
కరోనా వ్యాక్సిన్​ లభ్యత, సరఫరాపై నిపుణుల కమిటీ భేటీ
author img

By

Published : Aug 12, 2020, 8:31 PM IST

కరోనా టీకా అడ్మినిష్ట్రేషన్​పై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం బుధవారం తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా స్వదేశీ, విదేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్​ కొనుగోలు విధానాలతో పాటు, వ్యాక్సిన్​ ముందుగా ఎవరికి ఇవ్వాలన్న అంశాలపై సభ్యులు చర్చించారు.

నీతి ఆయోగ్​ సభ్యుడు డా.వీకేపాల్​ నేతృత్వంలో ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం సమావేశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు తమ మార్గాల ద్వారా టీకా సేకరణ చేయవద్దని సూచించినట్లు తెలిపింది.

వ్యాక్సిన్​ తయారీతో పాటు దేశంలో ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు పాటించాల్సిన విధివిధానాలు, మౌలిక సదుపాయాలపై చర్చించారు. పలు సంస్థలు టీకా తయారీకి కృషి చేస్తున్నాయి. ఏ సంస్థ టీకాకు అనుమతులు ఇవ్వాలి, ఆయా సంస్థల్లో పరిశోధన ఏ స్థాయిలో ఉందో సమీక్షించారు. వ్యాక్సిన్లపై జాతీయ సాంకేతిక సలహా బృందం నుంచి కూడా వివరాలు కోరింది కమిటీ. టీకా ప్రక్రియను ట్రాక్​ చేయడానికి ఉన్న వ్యవస్థలు, నూతనంగా తీసుకురావాల్సిన విధానాలు, వ్యాక్సిన్​ భద్రత, నిఘాకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి.. వాటిని ఎలా అధిగమించాలనే వ్యూహాలపై కూడా చర్చించారు.

- కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.