ETV Bharat / bharat

రేపు కొవిడ్ వ్యాక్సిన్ నిపుణుల కమిటీ భేటీ - Oxford University-developed COVID-19 vaccine

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం సమావేశం కానుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సేకరణ, రవాణా సహా ఇతర అంశాలపై నీతిఆయోగ్‌ సభ్యుడు వీకీ పాల్‌ నేతృత్వంలోని ఈ కమిటీ చర్చించనుంది. సమావేశంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు పాల్గొననున్నాయి.

Expert committee on COVID-19 vaccine administration to meet on Wednesday
రేపు కొవిడ్ వ్యాక్సిన్ నిపుణుల కమిటీ భేటీ
author img

By

Published : Aug 11, 2020, 12:22 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ సేకరణ, నిర్వహణలో ఎదురయ్యే లాజిస్టిక్స్, నైతికపరమైన అంశాలను పరిశీలించడానికి నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ అధ్యక్షతన నిపుణుల కమిటీ బుధవారం భేటీ కానుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, వ్యాక్సిన్ తయారీదారులతో ఈ కమిటీ చర్చలు జరపనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాత కావాల్సిన కోల్డ్ చైన్ లాజిస్టిక్స్, పంపిణీ వ్యూహాలు, శిక్షణ వంటి అంశాలపై సమగ్ర వ్యూహాలను కమిటీ రూపొందిస్తుంది.

"కొవిడ్‌ వ్యాక్సిన్‌పై నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ సమావేశం ఆగస్టు 12న జరగనుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సేకరణ, రవాణా సహా ఇతర అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది."

-కేంద్ర వైద్య శాఖ ట్వీట్

దేశంలో టీకా అభివృద్ధి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్​ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా రూపొందించిన కొవాగ్జిన్​తో పాటు, జైడస్ కాడిలా టీకా సైతం ఫేజ్-2 ట్రయల్స్​లోకి అడుగుపెట్టాయి. ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకాకు దేశంలో ఫేజ్-2, 3 క్లినికల్ ట్రయల్స్ చేపట్టే విధంగా సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి లభించింది.

ఇదీ చదవండి: 'మేం కలిసే ఉన్నాం.. మా సోదరభావం కొనసాగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.